సింగర్ మోజులో పడి భార్యను వదిలేసిన స్టార్ హీరో..!

ఇటీవల తమిళ స్టార్ హీరో జయం రవి సైతం తన భార్యకు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన విడాకులకు సంబంధించిన కారణాలు ఒకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. జయం రవి ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారని తెలుస్తోందిఅధికారికంగా తాము విడిపోతున్నట్టు జయం రవి తెలిపారు. అటు జయం రవి భార్య ఆర్తి సైతం విడాకులపై కీలక ప్రకటన చేశారు.

విడాకుల గురించి తనని సంప్రదించకుండానే ప్రకటించారని జయం రవి భార్య ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది. జయం రవి ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే భార్య నుంచి విడాకులు తీసుకుని పది రోజులు కూడా కాకుండానే జయం రవి మరో అమ్మాయితో క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించారు. జయం రవి కేనిషా ఫ్రాన్సిస్ అనే సింగర్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ తెర మీదకు వస్తున్నాయి. ఈమె కారణంగానే జయం రవి తన భార్యకు విడాకులిచ్చారనే పుకార్లు షికార్లు చేశాయి.

Jayam Ravi s Divorce A New Twist with Rumors of a New Relationship and a Psychologist

తాజాగా దీనిపై కేనిషా ఫ్రాన్సిస్ క్లారిటీ ఇచ్చారు. జయం రవితో నాకు పరిచయం ఉంది కానీ.. మా మధ్యన ఎలాంటి సంబంధం లేదు. జయం రవికి నేను సైకాలజిస్ట్‌గా ట్రీట్ మెంట్ చేస్తున్నాను. జయం రవిని అతడి భార్య, అత్తగారు ఇద్దరూ మానసికంగా వేధించారు. మానసికంగా గాయపడిన జయం రవి నా దగ్గర చికిత్స తీసుకుంటున్నాడు. మేమిద్దరం కలసి ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రారంభించాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలిపింది. ఆర్తి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదు. తన తప్పులు బయట పడతాయనే భయంతోనే ఆర్తి ఇలా ఆరోపణలు చేస్తోంది అని కెనీశా తెలిపింది.

అయితే వాస్తవం మాత్రం అలా కనిపించడం లేదు. భార్యకు విడాకులిచ్చిన తర్వాత జయం రవి ఎక్కువగా కేనిషా ఫ్రాన్సిస్‌తోనే ఉంటున్నాడు.తాజాగా జయంరవి సోమవారం కెనీశాతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.స్వామివారి దగ్గరకు వీరిద్దరు జంటగా వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+