ఆయనను నా కోరిక తీర్చమని అడిగా - గ్లామర్ క్వీన్

'గ్లామర్ క్వీన్' జయమాలిని.. ఈ ఒక్క పేరు చాలు థియేటర్స్ షేక్ అవ్వడానికి. 1970, 80వ దశకాల్లో ఆమె పాట లేని సినిమా ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. సినీరంగంలో సుమారు మూడు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన ఈమె ఐదు వందలకు పైగా చిత్రాల్లో మెరిశారు. అటు ముఖ్య పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్ లో కూడా అలరించారు.

అప్పట్లో స్టార్ హీరోయిన్స్ కన్నా ఈ భామకే ఎక్కువ క్రేజ్ ఉండేదని అంటుంటారు. సినిమాలో జయమాలిని పాత ఉందంటే చాలు.. ఆమె కోసమే సినిమాకి వచ్చే వాళ్లు చాలా మందే ఉన్నారు. దాదాపు ముప్పై ఏళ్ల పాటు తనదైన శైలిలో ప్రేక్షకలకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చారు. కాగా రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయమాలిని.. తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

jayamalini-shocking-comments-about-acting-with-sr-ntr

కుటుంబం కోసమే ప్రేమను దూరం చేసుకున్నానని ఎమోషనల్ అయ్యారు. అప్పట్లో తన అందం వల్ల అనేక ఆకర్షణలు ఎదురైనా.. కానీ తన తల్లిదండ్రులు, తోబుట్టువుల బాధ్యత తనపై ఉండటంతో వాటిని పట్టించుకోలేదన్నారు. అలానే మలయాళ సూపర్‌స్టార్ జయన్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారని కూడా తెలిపారు. కానీ తాను మాత్రం ఆ వివాహ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు.

అంతే కాకుండా సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఓ సన్నివేశం గురించి మాట్లాడుతూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ సన్నివేశంలో, ఒక పార్టీ వాతావరణంలో సోఫాలో కూర్చున్న ఎన్టీఆర్‌ను విలన్‌తో కలిసి జయమాలిని పాత్ర ఒక పథకం పన్నుతుందని చెప్పారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ ను తన వైపు తిప్పుకోవాలని జయమాలిని ప్రయత్నించడం.. తన కోరిక తీర్చమని ఎన్టీఆర్ వెంటపడేలా చూపించారని చెప్పుకొచ్చారు. అయితే సినిమా విడుదలయ్యాక ఆ సన్నివేశం చూసినప్పుడు నిజంగా షాకయ్యానని అన్నారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

jayamalini-shocking-comments-about-acting-with-sr-ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+