ఎన్టీఆర్ ఆ స్టార్ హీరోయిన్‌పై చేయి చేసుకున్నారా..?
తెలుగు సినిమా దిగ్గజం నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే తొలుత ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకోవాలి. అంతలా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రభావితం చేశారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు. దర్శకు, నిర్మాతలు ఆయన్ను దైవంగా కొలుస్తారు. అలాంటి ఎన్టీఆర్‌పై స్టార్ హీరోయిన్ సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్టీఆర్ తనని కొట్టారని ఆమె ఆరోపించారు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు జయప్రద. ఎన్టీఆర్‌తో జయప్రద యమగోల మూవీలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓలమ్మి తిక్క రేగిందా సాంగ్‌లో ఎన్టీఆర్ కొట్టడంతో తనకు మూడు రోజుల పాటు జ్వరం వచ్చిందని జయప్రద వెల్లడించారు. బాక్సాఫీస్ వద్ద యమగోల సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఓలమ్మి తిక్క రేగిందా సాంగ్ ఇప్పటికి కను రెప్పలు కొట్టకుండా చూస్తారు.

గతంలో జయప్రద తాను వ్యాఖ్యతగా వ్యవహారించిన షోలో జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా విచ్చేసిన సందర్భంలో జయప్రద ఈ విషయాలను బయటపెట్టడం జరిగింది. తన తాత నటించిన యమగోల సినిమాను జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాగా రీమేక్ చేసి హిట్ కొట్టారు. సింహాద్రి సినిమా తర్వాత హిట్ లేక ఇబ్బంది పడుతున్న జూనియర్ ఎన్టీఆర్‌కు యమదొంగ ఊరటనిచ్చింది. ప్రస్తుతం జయప్రద మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications