అల్లు అర్జున్ కోటరీ నుంచి మరొకరు ఔట్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో తన క్రేజ్ ను దేశవ్యాప్తంగా సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇటు తెలుగులోనే కాదు ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు కూడా అల్లు అర్జున్‌ను అక్కున చేర్చుకున్నారు. అందుకే వారి అభిమానానికి చిహ్నంగా పాట్నాలో పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహించగా రెండు లక్షల మంది అభిమానులు హాజరయ్యారు. అల్లు అర్జున్ సినిమాల్లో నటిస్తున్నప్పటి నుంచి తనకంటూ కొందరు స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. వారు బన్నీ చేసే ప్రతి సినిమాతో కలిసి ప్రయాణం చేస్తుంటారు. వారి మధ్య అనుబంధం అనేది అలా ఉంటుంది.
కోటరీ నుంచి జానీమాస్టర్ వెళ్లిపోయారు
అల్లు అర్జున్ సినిమాల్లో జానీ మాస్టర్ పాట లేకుండా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అల వైకుంఠపురంలో అద్భుతమైన నృత్య సన్నివేశాలను రూపొందించి అల్లు అర్జున్ తో చేయించారు జానీమాస్టర్. వాటిల్లోని పాటలు సూపర్ హిట్ అవడమే కాకుండా నృత్యాలకు, వాటి మూమెంట్లకు మంచి పేరు వచ్చింది. అయితే లేడీ కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించారంటూ కేసు రావడంతో జైలుకు వెళ్లడం, బెయిల్ పై బయటకు రావడం జరిగింది. అల్లు అర్జున్ కు ఎంతో సన్నిహితంగా ఉండే జానీమాస్టర్ ప్రస్తుతం బన్నీ నుంచి దూరమయ్యారు. అలాగే ఆయన కోటరీ నుంచి ఔట్ అయిన మరొక వ్యక్తి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్.

ముగ్గురు చేస్తున్న పుష్ప2 బీజీఎం
దేవిశ్రీప్రసాద్ తో కూడా అల్లు అర్జున్ కు ఎంతో సన్నిహితత్వం ఉంది. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారు. అయితే పుష్ప2 సినిమాకు ఇచ్చిన సంగీతం బాగోలేదని నిర్మాత, దర్శకులు తమన్ తోపాటు మరో ఇద్దరు సంగీత దర్శకులకు బీజీఎం అప్పజెప్పారు. చెన్నైలోని ఓ కళాశాలలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో దేవిశ్రీప్రసాద్ బహిరంగంగానే మాట్లాడారు. తనగురించి నిర్మాతలకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మనకు ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలని, అది డబ్బులైనా, తెరపై ఏది కావాలన్నా అంటూ వ్యాఖ్యానించారు. తర్వాత నుంచి బన్నీతోకానీ, మైత్రీతోకానీ, సుకుమార్ తోకానీ దేవిశ్రీప్రసాద్ కు సినిమాలు ఉంటాయా? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ దేవిశ్రీప్రసాద్ ను తీసుకునే అవకాశం కనపడటంలేదు. ఇటువంటి తరుణంలో బన్నీ కోటరీ నుంచి దేవిశ్రీప్రసాద్ కూడా బయటకు వెళ్లిపోయినట్లే. తెరపై కాకపోయినా తెరవెనక మాత్రం వీరు మంచి స్నేహితులుగానే ఉంటారు.












Click it and Unblock the Notifications