ఎన్టీఆర్ మొట్ట మొదటి అభిమాని ఇతనే..స్టేజ్‌పైకి పిలిచి మరీ హగ్
జూనియర్ ఎన్టీఆర్... ఈ పేరు వినగానే కళ్లు చెదిరే డ్యాన్స్, డైలాగులకు ప్రాణం పోసే నటన, మరియు అసాధారణమైన స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తుకు వస్తాయి. ఆయన సినీ ప్రస్థానం కేవలం ఒక నటుడి ప్రయాణం కాదు, ఒక సాధారణ యువకుడు తనని తాను పూర్తిగా మార్చుకొని, ప్రేక్షకులను మెప్పించి, గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన అద్భుతమైన గాథ.
"నిన్ను చూడాలని"తో మొదలైన తారక్ సినీ ప్రస్థానం, ఆయన అభిమానులకు ఒక మధురానుభూతి. అయితే, ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేకపోయింది. కానీ, ఆ తర్వాత వచ్చిన "స్టూడెంట్ నెం. 1" సినిమాతో రాజమౌళి దర్శకత్వంలో తనలోని అసలైన నటుడిని బయటపెట్టారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించి, తారక్‌ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది.

"ఆది", "సింహాద్రి" వంటి సినిమాలతో యూత్ సెన్సేషన్‌గా, మాస్ హీరోగా ఎదిగారు. ఈ సినిమాలలో ఆయన నటన, డైలాగ్ డెలివరీ, మరియు డ్యాన్స్ వేరే లెవల్లో ఉంటాయి. ఇక, "యమదొంగ"తో తనలోని హాస్య, కామెడీ టాలెంట్ ను బయటపెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనిపించుకున్న తారక్, ఆ తరువాత "బృందావనం", "బాద్ షా" లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకున్నారు.
"టెంపర్", "జనతా గ్యారేజ్", "అరవింద సమేత" వంటి సినిమాలతో తనలోని పరిణతి చెందిన నటుడిని చూపించారు. ఎమోషనల్ సీన్లలో ఆయన నటన, ఆ పాత్రలలోని depth చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక, "ఆర్ఆర్ఆర్" సినిమాతో తన నటనకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తారక్‌లోని నటుడిని ప్రపంచానికి చూపించి, గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ తన 25 ఏళ్ల కెరీర్ గురించి గుర్తు చేసుకున్నారు. తన మొదటి సినిమా "నిన్ను చూడాలని" షూటింగ్ తొలి రోజును గుర్తు చేసుకుంటూ..ఓ వ్యక్తి నా వెనుకే తిరిగాడు. ఎవరు మీరని అతన్ని ప్రశ్నిస్తే..నా పేరు ముజీబ్ నేను మీ అభిమానిని బాబు అని చెప్పడంతో షాక్ అయ్యానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అతని మాటలు విని షాక్ అయ్యానని,ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.. అప్పుడే ఫ్యాన్ అని ప్రశ్నిస్తే.. నేను మీతోనే ఉంటానని అతను చెప్పడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపే సమయంలో .. సదరు వ్యక్తి స్టేజ్‌పైకి రావడంతో ఎన్టీఆర్ సైతం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా అభిమాని ఉండటం ఎంతో అదృష్టమని ఎన్టీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications