బాలయ్యకు బర్త్‌డే విషెస్ చెప్పని జూనియర్ ఎన్టీఆర్
నందమూరి నటసింహం బాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా జరుపుకున్నసంగతి తెలిసిందే. ప్రతి ఏడాది జూన్ 10న బాలయ్య జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అంగరంగ వైభవంగా జరుపుతారు. సినీ పరిశ్రమకు చెందినవారు, రాజకీయ రంగానికి చెందిన సెలబ్రిటీలు బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు. దీంతో వీరిమధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంగా అందరికీ తేటతెల్లమైంది.
ఎటువంటి సంబంధాలు కొనసాగడంలేదు
కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్.. ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబును జగన్ అరెస్ట్ చేసిన సమయంలో కూడా తాను స్పందించలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఎక్స్ లో శభాకాంక్షలు తెలియజేయగా, దానికి ఆయన బదులిచ్చారు. అంతకుమించి ఎటువంటి సంబంధాలు కొనసాగిన దాఖలాలు కనపడలేదు. ఇటీవలే హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ సినీరంగ ప్రవేశం జరిగింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమాకు నిర్మాత కూడా ఆయనే. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచలంతా హాజరయ్యారు.

కాలమే సమాధానం చెబుతుంది
ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ స్పందించలేదు. పెద్దన్న కుమారుడికి ఎటువంటి శుభాకాంక్షలు తెలియజేయలేదు. ప్రధానంగా బాలయ్య మాత్రం ఎన్టీఆర్ అంటే తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్లు సమాచారం. సీనియర్ ఎన్టీఆర్ వర్థంంతి సందర్భంగా గతేడాది అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలను ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన బాలయ్య అది తీసేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. వెంటనే దాన్ని తీసేశారు. వీరిమధ్య విభేదాలకు కారణాలు తెలియరావడంలేదుకానీ గతంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు బాలయ్య, ఎన్టీఆర్ మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించారు. అయినా కుదర్లేదు. ఈ విభేదాలు ఇలాగే కొనసాగుతాయా? లేదంటే సద్దుమణుగుతాయా? అనేదానికి సమాధానం కాలమే చెప్పాలి.












Click it and Unblock the Notifications