JR NTR- సుకుమార్ రగ్గ్‌డ్ మూవీ.. ఊర మాస్
ఈసారి టాలీవుడ్ అనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రికార్డులు తిరగరాసేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, లెక్కల మాస్టర్ సుకుమార్ మళ్ళీ చేతులు కలుపుతున్నారు. 'పుష్ప' సినిమాతో సుకుమార్ సృష్టించిన ఏ స్థాయిలో సంచలనం సృష్టించారో మనకు తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయి 'రా' అండ్ 'రగ్గ్డ్' లుక్‌తో ఎన్టీఆర్‌ను వెండితెరపై చూపించేందుకు సుకుమార్ ఒక శక్తివంతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కథ అత్యంత సహజంగా, మట్టి వాసన ఉట్టిపడేలా ఉండబోతోంది.
'పుష్ప'లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను చూపించిన సుకుమార్, ఎన్టీఆర్ కోసం దానికి మించిన ఒక డార్క్ యాక్షన్ డ్రామాను ఎంచుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ గతంలో ఎన్నడూ చూడని విధంగా చాలా మొరటుగా, ఇంటెన్స్‌గా ఉండనుంది. దీనికోసం ఎన్టీఆర్ కూడా తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోబోతున్నారు.

థియేటర్లు దద్దరిల్లడమే
వీరిద్దరి మొదటి సినిమా 'నాన్నకు ప్రేమతో'లో ఎన్టీఆర్ సూట్ వేసుకుని, లండన్ వీధుల్లో క్లాస్‌గా కనిపించారు. కానీ ఈ రెండో సినిమా దానికంటే పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అడవి లేదంటే గని నేపథ్యంలో కథ ఉంటుంది. మట్టి కొట్టుకుపోయిన బట్టలు, గడ్డం, ఇంటెన్స్ కళ్లతో ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక సామాజిక అంశంపై పోరాడే వీరుడిగా కనిపించనున్నారు. సుకుమార్ మార్కు మేకింగ్, ఎన్టీఆర్ మార్కు పర్‌ఫార్మెన్స్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. హీరో, దర్శకుడు పాన్ ఇండియా స్థాయివారే కావడంతో ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడక ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.
క్రేజ్ అప్పటికే భారీగా పెరగనుంది
సుకుమార్ సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎప్పుడూ ఒక మిస్టరీగా, మాస్‌కు దగ్గరగా ఉంటుంది. ఎన్టీఆర్ లాంటి నటుడికి సుకుమార్ ఎలాంటి మాస్ మేనరిజమ్స్ డిజైన్ చేస్తారోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమయ్యే సమయానికి ఎన్టీఆర్ డ్రాగన్, త్రివిక్రమ్, దిలీప్ కుమార్ నెల్సన్ సినిమాలు పూర్తిచేసే అవకాశం ఉంది. ఈ సినిమాలతో పూర్తిస్థాయి పాన్ ఇండియా హీరోగా మారిపోతారు. అప్పుడు క్రేజ్ కూడా ఎన్టీఆర్ కు భారీస్థాయిలో ఉండే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications