ఎన్టీఆర్, రామ్ బంధువులు.. ఏమవుతారో తెలుసా?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. మొదటి భాగం ఏప్రిల్ 5వ తేదీనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడంలో ఆలస్యం జరగడంతో విజయ దశమికి వాయిదా పడింది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హిందీ బెల్టులో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కులను కరణ్ జోహార్, అనిల్ తడానీ కొనుగోలు చేశారు.
తెలుగులో యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి నార్త్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలన్నీ హిందీలోకి డబ్ చేసి విడుదల చేసినప్పుడు అగ్ర స్థాయి హీరోలకన్నా ఎక్కువగా వ్యూస్ సంపాదించుకున్నాయి. భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమా చేయడానికి రామ్ సిద్ధమవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని బంధువులు అవుతారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గతంలో ఓ వేదికపై రామ్ పోతినేని మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకు వరుసకు అన్నయ్య అవుతాడు అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియోనే వైరలవుతోంది. ఇది తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు, రామ్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లుగా ఈ విషయం మనకు తెలియలేదే అని ఆశ్చర్యపోతున్నారు. రామ్ సినిమాల విషయానికి వస్తే చివరగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమా చేశాడు. అయితే అది దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. లాజిక్ లేకుండా సినిమా తీసిన బోయపాటి రామ్ అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.












Click it and Unblock the Notifications