ప్రభాస్‌తో చెప్పి ఆ రికార్డును బద్ధలు కొట్టిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం దేవర. ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతోంది. ఆరు సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటే మరో ఇండస్ట్రీ హిట్ ఖాయమే అంటున్నారు అభిమానులు. జాన్వీకపూర్ కథానాయికగా నటించగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లాంటి నటులతోపాటు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
రెండు మిలియన్ డాలర్లు రాబట్టింది
ఈ సినిమా విడుదలకు ముందే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ లో కొత్త రికార్డులు నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. బుక్ మై షోలో ఇప్పటికే 3.50 లక్షల ఇంట్రస్ట్ లను దక్కించుకుంది. ఉత్తర అమెరికాలో 1 మిలియన్ డాలర్లను అడ్వాన్స్ రూపంలో రాబట్టింది. సినిమా విడుదల దగ్గరపడే కొద్దీ సినిమా టికెట్లు మరింత విక్రయమవుతాయని భావిస్తున్నారు. విడుదలకు ఇంకా వారం రోజుల సమయం ఉండగానే రెండు మిలియన్ డాలర్లను రాబట్టింది. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.17కోట్లకు పైగా.

నాలుగో చిత్రంగా దేవర
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో రెండు మిలియన్ డాలర్లను వసూలు చేసిన నాలుగో చిత్రంగా దేవర రికార్డును సొంతం చేసుకుంది. ఇంతకుముందు నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ ఈ రికార్డును సాధించాయి. కెనడాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయి. సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ రూపంలో రెండు మిలియన్ డాలర్లను సాధించే క్రమంలో ప్రభాస్ తో జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా పోటీపడుతున్నారు. సలార్, కల్కి సినిమాలకంటే ఎక్కువ ప్రతిస్పందన దేవరకే వస్తోంది. అభిమానులు ఈ సినిమాకు ఎక్కువగా స్పందిస్తున్నారు. ఓవర్సీస్ లో ప్రభాస్ ను దాటేసి అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పడం ఖాయమైంది.












Click it and Unblock the Notifications