ఎన్టీఆర్ బామర్ధి హీరో అన్నారు.. సైడ్ క్యారెక్టరా..?
ఈ వారం చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఓ అరడజను సినిమాలు వెండితెర మీద దండయాత్ర చేశాయి.శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. '800' , సిద్దార్థ్ నటించిన 'చిన్నా' ,కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన 'రూల్స్ రంజన్' ,సుధీర్ బాబు హీరోగా చేసిన 'మామా మశ్చీంద్ర', కొత్త నటులతో తెరకెక్కిన 'మ్యాడ్' సినిమాలు ఈ వారం విడుదలైయ్యాయి.
వీటిల్లో 'మ్యాడ్' సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న విధంగానే యువతను మెప్పించగలిగింది. మొదలు నుంచి చివరి వరకు సినిమా మొత్తం ఫన్‌తో సాగింది. రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడుకి ఎటువంటి బోర్ కోట్టకుండా సీట్లల్లో కూర్చోబెట్టడంతో దర్శకుడు విజయవంతం అయ్యాడు. సినిమాలో చెప్పుకొవడానికి పెద్దగా కథ లేకపోయినప్పటికి.. యూత్ 'మ్యాడ్'కు బాగా కనెక్ట్ అయ్యారు.

హ్యాపీడేస్ తరువాత మళ్లీ అంతగా మెప్పించే యూత్ సినిమా 'మ్యాడ్' అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బామర్ది హీరో అని చిత్ర యూనిట్ బాగా ప్రచారం చేశారు. ఎన్టీఆర్‌కు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. ఎన్టీఆర్ బామర్ది హీరో అనగానే ఆయన అభిమానులు సహజంగానే సినిమాపై అంచనాలు పెట్టుకుని వస్తారు.

అలా అంచనాలు పెట్టుకుని వచ్చిన ఎన్టీఆర్ అభిమానులకు 'మ్యాడ్' సినిమా నిరాశ కలిగించింది. సినిమా బాగున్నప్పటికీ ..ఎన్టీఆర్ బామర్ది నార్నే నితిన్‌ది సినిమాలో అంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాదనిపిస్తుంది. సినిమా స్పేస్ మొత్తం సంగీత్ శోభన్ తీసేసుకున్నాడనే చెప్పాలి. మొదటి నుంచి చివరి వరకు సినిమా భారం మొత్త సంగీత్ శోభన్ మోసినట్టుగా స్పష్టం అవుతుంది. ఇంకా చెప్పాలంటే సినిమా మొత్తం సంగీత్ శోభన్ చూట్టునే తిరుగుతుంది. దీంతో మిగిలిన క్యారెక్టర్లన్నీ కూడా అలా వచ్చి ఇలా వెళ్లినట్టుగా అనిపిస్తుంది. దాంతో 'మ్యాడ్' సినిమా చూసిన వారందరూ కూడా సంగీత్ శోభన్ హీరో అని చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications