మనసులో పెట్టుకోను.. ఓపెన్‌గానే ఉంటాను: బాలయ్యతో విభేదాలపై జూనియర్ ఎన్టీఆర్

నందమూరి వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ మధ్య విభేదాలున్నాయంటూ కొంతకాలం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విభేదాలకు స్వస్తి పలికేలా చేసేందుకు ఎంతోమంది పెద్దలు ప్రయత్నించారుకానీ కుదర్లేదు. సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి సమయంలో ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తారక్, కల్యాణ్ రామ్ తాత తారకరాముడికి నివాళులర్పించారు. ఆ సమయంలో అభిమానులు తారక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తర్వాత తండ్రికి నివాళి అర్పించేందుకు వచ్చి తారక్ కు సంబంధించిన ఫ్లెక్సీలు తీయించాలంటూ ఆదేశించారని వార్తలు వచ్చాయికానీ బాలయ్య చెప్పిన విషయాన్ని కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయని తర్వాత అభిమానులు వెల్లడించారు.

తనకు తండ్రిలాంటివారు
ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరలవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ ను విలేకరులు బాలయ్యతో విభేదాలపై అడిగారు. దీంతో తారక్ మాట్లాడుతూ తనకు బాలయ్యతో విభేదాలేంటండి.. ఎటువంటి సమస్యలు తమ మధ్య లేవని, సమస్య అనేదే లేదని తేల్చిచెప్పారు. సమస్య ఏమిటనేది తనకు కూడా తెలియదన్నారు. తన తండ్రి హరికృష్ణకు ఆయన సోదరుడు.. తనకు తండ్రిలాంటివారు.. అటువంటప్పుడు ఆయనతో తనకు విభేదాలెందుకు ఉంటాయని ఎదురు ప్రశ్నించారు. ఏ విషయాన్ని తాను మనసులో పెట్టుకోనని, ఏ విషయంలోనైనా తాను ఓపెన్ గా ఉంటానని తారక్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

junior ntr clarified his differences with nandamuri Balakrishna

టికెట్ల పెంపునకు అనుమతి
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో ఉంచారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ స్పందించలేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులతోపాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికలు జరిగి చంద్రబాబు గెలుపొందిన తర్వాత మాత్రం తారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయగా, దానికి చంద్రబాబు కూడా బదులిచ్చారు. ఇటీవలే దేవర సినిమాకు ఏపీలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+