నెంబర్ 1 గా జూనియర్ ఎన్టీఆర్... నెంబర్ 2గా మహేష్ బాబు!
భారీ తారాగణంతో, భారీ ఖర్చుతో ఆర్భాటంగా తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయనే విషయాన్ని యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ ఆధారంగా అంచనా వేస్తున్నారు. దేవర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 26.17 మిలియన్ల వ్యూస్ సాధించింది. దేవరపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో వీటినిబట్టి అర్థం చేసుకోవచ్చు.
యూట్యూబ్ లో దేవర మొదటి స్థానంలో నిలవగా మహేష్ బాబు గుంటూరు కారం రెండోస్థానంలో నిలిచింది. ఈ సినిమా గ్లింప్స్ కు 20.98 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మహేష్ బాబుపై తారక్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పుష్ప2, లైగర్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, ప్రాజెక్ట్ కే, భీమ్లా నాయక్ ఈ రెండింటి తర్వాత స్థానాల్లో నిలిచాయి. దేవర, గుంటూరు కారం.. ఈ రెండు సినిమాలు కలెక్షన్ల విషయంలో కూడా మ్యాజిక్ చేస్తాయని అభిమానులు గంపెడంత ఆశతో ఎదురుచూస్తున్నారు.

గుంటూరు కారం మూవీ మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. ఏపీలో ఈ సినిమా బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే మొదలయ్యే అవకాశం కనపడుతోంది. దేవర సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోందంటున్నారు. దీనిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ ను గడగడలాడిస్తుందనే నమ్మకంతో ప్రిన్స్ అభిమానులున్నారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని తెరకెక్కించారు. నాన్ థియేట్రికల్ హక్కులు 100 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం.












Click it and Unblock the Notifications