బాలయ్య ఈవెంట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్కెచ్ అదిరింది!

నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను ఘనంగా సత్కరించింది. హైదరాబాద్ నోవాటెల్ లో వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి, వెంకటేష్ తోపాటు అతిరథ మహారధులంతా హాజరయ్యారు. నందమూరి కుటుంబంలోని సభ్యులందరినీ ఆహ్వానించే బాధ్యత బాలయ్య సోదరుడు నందమూరి రామకృష్ణకు అప్పగించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ను ఆహ్వానించారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

కుందాపురానికి వెళ్లిన తారక్
వాస్తవానికి వీరిద్దరినీ ఆహ్వానించలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో లేరు. సెప్టెంబరు రెండోతేదీన తారక్ తల్లి షాలిని పుట్టినరోజు ఉంది. ఆమె కోరిక మేరకు కర్ణాటకలోని స్వగ్రామం కుందాపురానికి తారక్ తీసుకువెళ్లాడు. భార్య ప్రణతి, తల్లితో కలిసి కుందాపురానికి చేరుకున్న తారక్ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లి కోరికను నెరవేర్చానని, అందుకు సహకరించిన రిషభ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

junior ntr did not attend nandamuri balakrishna 50 years golden jubilee event

హైదరాబాద్ లో లేకుంటే సరి
జూనియర్ ఎన్టీఆర్ ను బాలయ్య ఈవెంట్ కు ఆహ్వానించారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే హైదరాబాద్ లో ఉండి ఎందుకు ఈవెంట్ కు రాలేదు అనే ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ కు ఎదురవుతుంది. ఆహ్వానిస్తే కచ్చితంగా ఆయన వస్తారా? రారా? అనేది సందేహాస్పదంగా ఉంది. వీటన్నింటికన్నా ఉత్తమమైన పని ఏంటంటే హైదరాబాద్ లో లేకుండా ఉండటమే అని ఆయన భావించారు.

ఏదేమైనప్పటికీ తనను ఈ కార్యక్రమానికి పిలిచారా? లేదా? అనే విషయాన్ని అందరి సందేహాలకు వదిలేసిన తారక్ మాత్రం తన పని తాను చూసుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన దేవర సినిమా ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+