బిగ్ బ్రేకింగ్: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'లో విజయ్ దేవరకొండ?

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రూపొందుతున్న సినిమా 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఓకే అన్న ఎన్టీఆర్
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించబోతున్నాడు అని. 'దేవర'లో అత్యంత కీలకమైన ఓ పాత్ర ఉంది. దాని నిడివి తక్కువే అయినప్పటికీ కథను మలుపు తిప్పే బలమైన పాత్ర కావడంతో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోచేత చేయించాలని కొరటాల శివ భావించాడు. విజయ్ దేవరకొండ పేరును తారక్ కు సూచించగా అందుకు అతను కూడా ఓకే అన్నాడు.

 junior ntr movie devara

ఓకే అన్న రౌడీ హీరో
మేకర్స్ విజయ్ ని సంప్రదించగా ఆ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒకరకంగా ఇది క్రేజీ కాంబో అని చెప్పొచ్చు. ఓ వైపు యాక్టింగ్ పవర్ హౌస్, మరోవైపు యూత్ క్రేజీ స్టార్.. ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ప్రేక్షకులకు పండగే అని చెప్పొచ్చు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న' దేవర' చిత్రం.. 2024, ఏప్రిల్ 5 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇతర భాషలకు చెందిన పలువురు నటీనటులు కూడా దేవరలో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషలకు చెందినవారిని ప్రధానమైన పాత్రల్లోకి తీసుకున్నారు. గత సినిమా ఆచార్య ఫ్లాప్ కావడంతో ఎలాగైనా ఈ సినిమాను సూపర్ హిట్ చేయాలనే కసితో కొరటాల శివ పనిచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+