పవన్ కుమారుడికి ప్రమాదంపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏమన్నారంటే ?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. సింగపూర్ లోని రివర్ వ్యాలీ రోడ్డులో ఉన్న ఓ షాప్ హౌస్ లో మంటలు చెలరేగగా.. ఆ భవనంలోని 2, 3 ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించాయి. అందులోనే ఉన్న స్కూల్ లో మార్క్ శంకర్ సమ్మర్ క్యాంపులో భాగంగా పాఠాలు నేర్చుకుంటున్నారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరి తిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు సైతం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు.
ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. మాజీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేశారు. త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా మార్క్ శంకర్ కి జరిగిన ప్రమాదంపై స్పందించారు. ఈ మేరకు ఆ పోస్టులో.. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నారని విని బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు.
Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.
— Jr NTR (@tarak9999) April 9, 2025
ఇప్పటికే పవన్ హుటాహుటిన సింగపూర్ కు వెళ్లారు. ఆస్పత్రిలోనే తన కుమారుడిని పరామర్శించి తాజా చికిత్స పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్యం పైన ఆందోళన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్య పరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని పవన్ కు వైద్యులు వివరించారు. అలానే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు.
మరో మూడు రోజుల పాటు పవన్ అక్కడే కుమారుడు కోసం ఉండాలని నిర్ణయించారు. మార్క్ పూర్తిగా కోలుకునే వరకూ పవన్ అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. డిశ్చార్జ్ తరువాతనే పవన్ తిరిగి ఏపీకి వస్తారని సమాచారం. ఇక ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు పెద్ద వాళ్లతో సహా 15 మంది పిల్లలు గాయపడ్డారు. వారందర్నీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక చిన్నారి మృతి చెందినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications