Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏం జరిగింది?... విజయ్‌పై యుద్ధాన్ని ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో 'వార్2' చేస్తున్నారు. ఇది మల్టీస్టారర్ సినిమా. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. మైత్రీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు 'డ్రాగన్' అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇండియా, బర్మా, చైనా దేశాలను గడగడలాడించి డ్రగ్ స్మగ్లర్ కథతో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. 'డ్రాగన్' విడుదల తేదీని కూడా దర్శకుడు నీల్ ప్రకటించారు. 2026 జనవరి 9వ తేదీన విడుదల చేయబోతున్నారు. అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రాబోతోంది.

రాజకీయాలకు అనుగుణంగా మార్చారు
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన కెరీర్ లో చివరి సినిమా, తనకు 69వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో సినీ రంగానికి వీడ్కోలు పలికి రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు పార్టీ యంత్రాంగాన్ని నిర్మించబోతున్నారు. చివరి సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి'కి ఇది రీమేక్ సినిమా. కాకపోతే కాస్తంత మార్పుచేర్పులు చేసి దీన్ని రాజకీయాలకు అనుగుణంగా మార్చి తీయబోతున్నారు. పేరు కూడా 'జననాయగన్' అని ఖరారు చేశారు. దీన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

junior NTR Vijay to compete for 2026 Sankranti season

సంక్రాంతికి ఇద్దరూ హోరాహోరీగా..
జూనియర్ ఎన్టీఆర్, విజయ్ 2026 సంక్రాంతికి తీవ్రంగా పోటీపడబోతున్నారు. తారక్ ది పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుంది. అలాగే విజయ్ ది తమిళం, తెలుగులోనే విడుదల చేస్తారా? లేదంటే ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుందా? అనేది ఖరారు కాలేదు. బాక్సాఫీస్ దగ్గర మాత్రం వీరిద్దరూ హోరాహోరీగా తలపడనున్నారు. డ్రాగన్ సినిమా తమిళంలో విడుదల కావాలంటే ఆ సమయానికి చాలా తక్కువ స్థాయిలోనే థియేటర్లు దొరికే అవకాశం కనపడుతోంది. తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ వరకు ఇబ్బందిలేదు. డ్రాగన్ తో సంచలన విజయాన్ని అందుకోవాలని, రూ.వెయ్యి నుంచి రూ.1200 కోట్లు సాధించాలనే లక్ష్యాన్ని ఈ చిత్ర బృందం పెట్టుకుంది. ఎంతవరకు లక్ష్యాన్ని అందుకుంటారో చూడాలి. ఈ రెండు సినిమాలు కాకుండా సంక్రాంతి బరిలోకి ఇంకేమైనా సినిమాలు వస్తాయేమో చూడాలి. ఎందుకంటే సాధారణంగా ఏ హీరో కూడా సంక్రాంతి సీజన్ ను వదులుకోరు. ఆ సమయంలో విడుదలైన సినిమా సాధారణంగా ఉన్నప్పటికీ కలెక్షన్లు భారీగా వస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+