మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్... ఎన్టీఆర్‌తో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రం అందించిన ఘనవిజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.550 కోట్ల గ్రాస్ సాధించింది. విడుదలైన మొదటిరోజు నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ తారక్ తనకున్న మాస్ ఫాలోయింగ్, అద్భుతమైన నటనతో సినిమాను బ్లాక్ బస్టర్ గా మార్చారు. దర్శకుడిగా కొరటాల శివ విషయంలో కొంత విమర్శలు కూడా వచ్చాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు కొంత సాయపడింది. అయితే అభిమానులు మాత్రం అనిరుధ్ సరైన రీతిలో మ్యూజిక్ ఇవ్వలేదంటున్నాయి. ఇటువంటివన్నీ దాటుకొని సినిమా స్టడీగా రూ.550 కోట్లు రాబట్టడం విశేషమే.

దిలీప్ తో కలిసి తారక్
ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్న తారక్ దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఎనిమిది నెలల్లో ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తవుతాయి. ఆ తర్వాత ఎవరితో చేస్తారా? అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తుండగా ఓ వార్త బయటకు వచ్చింది. జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తారక్ కు కథ వినిపించారని, ఓకే అయిందని, ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఇదే పట్టాలెక్కుతుందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం దిలీప్ కుమార్ జైలర్ 2 పనుల్లో ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కు కూడా కథ వినిపించినప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపే బన్నీ మొగ్గుచూపాడు.

Junior NTR will do his next film with Nelson Dilip Kumar

దర్శకత్వ ప్రతిభతో మంచిపేరు
తన దర్శకత్వ ప్రతిభతో దిలీప్ కుమార్ మంచిపేరు తెచ్చుకున్నారు. యావరేజ్ సినిమాలతో కిందా మీదా పడుతున్న రజనీకాంత్ కు జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ అందించి రజనీ క్రేజ్ తగ్గలేదని దిలీప్ కుమార్ నిరూపించాడు. అంతకుముందు విజయ్ తో బీస్ట్ సినిమా చేసినప్పటికీ అది ఫ్లాప్ అయింది. వరుణ్ డాక్టర్, అంతకుముందు నయనతారతో చేసిని సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి. నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాల్లో అమ్మయిల రవాణా, డ్రగ్స్ సరఫరా, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ప్రధానాంశంగా ఉంటుంది. ఆ పాయింట్ ను పట్టుకొని స్క్రీన్ ప్లేతో నెల్సన్ మ్యాజిక్ చేస్తాడు. తన ప్రతి సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. తారక్ తో చేయబోయే సినిమాకు కూడా అనిరుధ్ రవిచందరే సంగీతం అందించే అవకాశం ఉందంటుందన్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+