వివాదంలో చిక్కుకున్న జ్యోతిక

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. పలు దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే తమిళనాడు ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే తమిళ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక తాను వేయలేదని చెప్పడం ఇప్పుడు వివాదానికి దారి తీస్తోంది. జ్యోతిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఇందులో భాగంగా ఓటు గురించి మాట్లాడి చిక్కుల్లో పడింది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసారా? అని జ్యోతికను యాంకర్ అడగ్గా.. దానికి ఈ అమ్మడు స్పందిస్తూ.. కొన్ని సార్లు ఆన్‌లైన్‌లో ఓట్లు వేశానని జ్యోతిక తెలిపింది.అలాగే ప్రతీ ఏడాది ఓట్లు వేస్తాను అని చెప్పింది.

Jyothika Gets Brutally Trolled FROM NETIZENS

దీంతో వెంటనే అలెర్ట్ అయిన యాంకర్ సరి చేస్తూ మేడమ్ అనడంతో.. జ్యోతిక ఓటింగ్ ఐదేళ్లకు ఒకసారి ఉంటుంది కదా అని చెప్తుంది. ఇలా తమకంటూ కొంచెం ప్రైవేట్ లైఫ్ ఉంటుంది వాటి పనులలో బిజీగా ఉండి ఓటు వేయలేకపోయాను అంటూ ఈమె సమాధానం చెప్పుకొచ్చారు.

అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ ఏ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.ఆన్‌లైన్‌లో ఓటు వేయడం ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు ఎన్ని పనులు ఉన్నా ఓటు వినియోగించుకోవడం మన హక్కు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. తాజాగా దీనిపై నటి కస్తూరి శంకర్ కూడా స్పందించారు.

మాలాంటి వారందరూ రోజంతా ఎండలో నిలబడి ఓట్లు వేశాము అమెరికా ఫ్లైట్ టికెట్ బుక్స్ చేసుకున్న క్యాన్సిల్ చేసుకుని మరి ఓట్లు వేసాము అంటూ కస్తూరి శంకర్ కూడా జ్యోతికకు కౌంటర్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మిస్ జ్యోతిక ఎందుకు ఓటు వేయలేదు.

ఒక్కోసారి మేము ఊర్లో లేకపోయినా వచ్చి మరీ వేశాం. మా కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా. ఆన్‌లైన్ ఓటింగ్ ఉంది, ప్రతిదీ ప్రచారం చేయబడదు'' అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఏడుస్తున్న ఎమోజీలను కూడా యాడ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట పోస్ట్ వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+