‘కాంత’ రివ్యూ: మరో 100 కోట్ల సినిమా లోడింగ్
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా, రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన 'కాంత' చిత్రం నేడు (నవంబర్ 14) థియేటర్లలో విడుదలైంది. 'మహానటి', 'సీతారామం' వంటి వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్, ఈసారి 1950ల నాటి సినీ ప్రపంచంలోని ఈగోల యుద్ధాన్ని మన కళ్ల ముందు నిలిపాడు. సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఒకప్పటి సూపర్‌స్టార్ జీవితంలోని సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని, వాస్తవికతకు కాల్పనికత జోడించి చేసిన ప్రయత్నం.
కథ
ఈ సినిమా కథంతా 'నట చక్రవర్తి' టీకే మహదేవన్ అలియాస్ టీకేఎం (దుల్కర్ సల్మాన్), గొప్ప దర్శకుడు అయ్య (సముద్రఖని) చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు గురు శిష్యులుగా ఉన్న వీరిద్దరూ, 'శాంత' అనే డ్రీమ్ ప్రాజెక్టును మధ్యలో ఆపాల్సి వస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అదే కథను టీకేఎంతో తీయాల్సి వచ్చినప్పుడు, స్టార్‌డమ్‌లోకి ఎదిగిన టీకేఎం తన ఈగోను ప్రదర్శిస్తాడు.

క్లైమాక్స్ మార్చడం, సినిమాకు 'కాంత' అని పేరు పెట్టడం, దర్శకుడిని కేవలం కుర్చీకే పరిమితం చేయడం వంటి చర్యలతో టీకేఎం షూటింగ్‌ను తన ఇష్టం వచ్చినట్లు నడిపిస్తాడు. ఈ అహంకార పోరులో, అయ్య శిష్యురాలైన హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) నలిగిపోతుంది. షూటింగ్ ఆఖరి రోజున, హీరో-దర్శకుడి మధ్య గొడవ జరగడంతో, ఆ స్టూడియోలో ఊహించని హత్య చోటు చేసుకుంటుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీస్ అధికారి ఫీనిక్స్ (రానా) రంగంలోకి దిగుతాడు. ఆ హత్య వెనుక ఉన్న రహస్యం ఏంటి? గురుశిష్యుల విబేధాలకి అసలు కారణం ఏమిటి? అనేదే తెరపై చూడాల్సిన కథ.
నటీనటుల ఫర్మామెన్స్:
దుల్కర్ సల్మాన్ నటన ఈ చిత్రానికి వెన్నెముక. 1950ల నాటి స్టార్ హీరోగా, ఈగో, నటన కలగలిసిన టీకేఎంగా ఆయన జీవించేశారు. ఆయనలోని వైవిధ్య నటుడిని ఈ పాత్ర మరోసారి నిరూపించింది. ఇక సముద్రఖని, దర్శకుడు అయ్య పాత్రలో ఒదిగిపోయి, తన కెరీర్‌లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగే ఈగో వార్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. భాగ్యశ్రీ బోర్సే కేవలం అందాలకే పరిమితం కాకుండా, నటన పరంగా ఆకట్టుకుంది. రానా దగ్గుబాటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా తన పాత్ర పరిధిలో మెప్పించాడు.
సాంకేతిక విలువలు:
డానీ కెమెరా పనితనం అద్భుతం. 1950ల నాటి వాతావరణాన్ని, ఆర్ట్‌వర్క్‌ను కళ్లకు కట్టినట్టు చూపించారు. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం కొన్ని కీలక సన్నివేశాలకు ప్రాణం పోసింది. పాటలు కథలో భాగమై, పాత కాలం నాటి అనుభూతిని అందించాయి.
ఎక్కడ వెనుకబడింది?
దర్శకుడి ఎంచుకున్న కథాంశం సినిమా నేపథ్య వర్గాలను ఎక్కువగా ఆకట్టుకునేలా ఉంది. అయితే, ఫస్టాఫ్‌లో హీరో-దర్శకుడి మధ్య కేవలం గొడవలను మాత్రమే చూపించడం, వారి విబేధాలకు గల మూల కారణాన్ని పూర్తిగా చెప్పకపోవడం వల్ల ప్రేక్షకులకి కొంత క్యూరియాసిటీ మిగిలిపోతుంది. సెకండాఫ్ హత్య కేసు విచారణ చుట్టూ తిరిగినప్పటికీ, కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ నెమ్మదిగా సాగడం కాస్త చిరాకు తెప్పిస్తుంది.
క్లైమాక్స్లో వచ్చే అనూహ్యమైన ఎమోషనల్ ట్విస్ట్ మరియు హంతకుడు ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చిందనే అంశాలు మాత్రం ప్రేక్షకుడిని కదిలిస్తాయి.దర్శకుడు సెల్వరాజ్ ఎంచుకున్న పీరియడ్ కథాంశం, బ్లాక్ అండ్ వైట్ సినిమా యుగాన్ని తెరపైకి తీసుకురావడం నిజంగా ప్రశంసించదగిన విషయం.
ముగింపు
'కాంత' సినిమా సాంకేతిక విలువలు, నటీనటుల అద్భుత ప్రదర్శన కోసం ఖచ్చితంగా చూడదగిన చిత్రం. పీరియాడికల్ డ్రామాలు, సినిమా నేపథ్య కథలను ఇష్టపడే వారికి, దుల్కర్ సల్మాన్ అభిమానులకు ఈ సినిమా మంచి అనుభూతినిస్తుంది. ఈగోల యుద్ధంలో నలిగిపోయిన ఒక సినీ కళాకారిణి కథను తెలుసుకోవాలంటే 'కాంత'కు వెళ్లాల్సిందే.
రేటింగ్: 3/5
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications