గ్లింప్స్‌తోనే పిచ్చేక్కించారుగా..!

ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న హృద్యమైన ప్రేమకథా చిత్రం "కాగితం పడవలు". ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ గ్లింప్స్ లోని భావోద్వేగ సన్నివేశాలు, మనసుకు హత్తుకునే సంభాషణలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి.

"చాలా దూరం వెళ్ళిపోయావు గోదావరి... నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్" అనే డైలాగ్ ఈ ప్రేమకథలోని లోతును, విరహాన్ని సూచిస్తోంది. తీరంలో కలిసిన జంట, అద్భుతమైన విజువల్స్, ఆహ్లాదకరమైన నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Kagitham Padavalu Glimpse A Heart-Touching Love Story by MGR Tukaram

దర్శకుడు ఎంజీఆర్ తుకారాం ఒక సున్నితమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు ఈ గ్లింప్స్ చూస్తే స్పష్టమవుతోంది. AIS. నౌఫల్ రాజా అందించిన సంగీతం, రుద్రసాయి & జానా సినిమాటోగ్రఫీ సినిమాకు గొప్ప అందాన్ని తెచ్చిపెట్టాయి. సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది.

త్వరలోనే థియేటర్లలోకి రానున్న ఈ "కాగితం పడవలు", తప్పకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అందమైన ప్రేమకథ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+