పబ్లిక్‌గా హీరోయిన్ కాజోల్‌ ప్రైవేట్ పార్ట్‌పై చేయి ( వీడియో)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ విజయదశమి సందర్భంగా దుర్గమాత దర్శనం కోసం ముంబైలోని పూజా మండపాన్ని సందర్శించారు. ప్రతీ ఏటా తన కుటుంబంతో కలిసి అత్యంత ఉత్సాహంగా పండుగ వేడుకల్లో పాల్గొనే కాజోల్‌కు, ఈసారి మాత్రం ఓ చేదు అనుభవం ఎదురైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

దుర్గమాత దర్శనం తర్వాత, కాజోల్ తన కుటుంబంతో కలిసి మెట్ల మార్గం గుండా కిందకి దిగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కిక్కిరిసిన జనంలో మెట్లు దిగుతుండగా, కాజోల్ భద్రత కోసం అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించారు.

Kajol s Alleged Inappropriate Touch Incident with Bodyguard at Durga Puja Goes Viral

ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ఆమెను వెనుకకు లాగే ప్రయత్నంలోనో లేదా కింద పడకుండా పట్టుకునే ప్రయత్నంలోనో అనుకోకుండా అసభ్యంగా తాకినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ముఖ్యంగా, అతను ఆమె ఛాతీ భాగాన్ని తాకినట్లుగా వీడియో ఫుటేజ్ ఆధారంగా కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

ఈ ఆకస్మిక చర్యకు షాక్‌కి గురైన కాజోల్, ఒక్కసారిగా వెనక్కి తిరిగి, కళ్ళు పెద్దవి చేసి కోపంగా అతన్ని చూసి ఏదో అన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఆమె ముఖంలో కనిపించిన ఆ అసౌకర్యంగా కనిపించారు. ఆ తరువాత, ఆమె కూతురు నైసా వచ్చి ప్రసాదం అందించగా, కాజోల్ సాధారణ స్థితికి వచ్చి ముందుకు సాగారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.ఆ వ్యక్తి కాపాడబోయి చేసింది కాదు, కావాలనే ఆ విధంగా తాకాడని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. ప్రముఖుల వద్ద భద్రతా సిబ్బందిగా ఉండి కూడా ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ రద్దీ ఎక్కువ ఉంది. మెట్ల మీద కాజోల్ కింద పడిపోతుందేమోనన్న ముందు జాగ్రత్తతోనే బాడీగార్డ్ వెంటనే పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అది కేవలం అనుకోకుండా జరిగిన ప్రమాదమే" అని మరికొందరు వాదిస్తున్నారు. ఆ రద్దీలో ఖచ్చితంగా ఏం జరిగిందనేది పూర్తిగా అర్థం కావడం లేదని అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా, ఓ బహిరంగ ప్రదేశంలో, అందునా పూజా వేడుకల సమయంలో ఒక స్టార్ హీరోయిన్ ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరమని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ సంఘటనపై కాజోల్ లేదా ఆమె టీమ్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ వైరల్ వీడియో మాత్రం సెలబ్రిటీల భద్రత మరియు పబ్లిక్ ఈవెంట్స్‌లో వారి ప్రైవసీ గురించి మరోసారి చర్చకు తెరలేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+