షూటింగ్ ప్రారంభం కాకుండానే ‘కల్కి2’ సంచలనం.. రికార్డు బిజినెస్
భారతీయ సినీ పరిశ్రమలో ఏకైక పాన్ ఇండియా హీరో ఎవరు అంటే.. అందరూ ఠక్కున చెప్పే పేరు.. ప్రభాస్. ఖాన్ త్రయాన్ని దాటేసి అంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కేవలం తన స్టార్‌డమ్‌తోనే థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన డార్లింగ్ రేంజ్ ఇప్పుడు వేల కోట్ల వ్యాపారానికి చేరుకుంది. 'ది రాజాసాబ్' సినిమా డిజాస్టర్ అనిపించుకున్నా, కేవలం ప్రభాస్ ఇమేజ్ కారణంగానే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంటే అది కేవలం ప్రభాస్ మార్కెట్ విలువకు నిదర్శనమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
అద్భుత దృశ్య కావ్యంగా..
ప్రభాస్ కెరీర్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 AD' ఒక అద్భుత దృశ్యకావ్యంగా నిలిచిపోయింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి నటుల కలయికతో వచ్చిన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది.

రూ.250 కోట్ల గ్రాస్ రావాలి
మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు 'కల్కి 2' సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ విషయంలో కొత్త చరిత్ర సృష్టించింది. ప్రముఖ పంపిణీ సంస్థ 'పార్శ్ ఫిలింస్' దాదాపు రూ. 115 నుంచి 120 కోట్ల రేంజ్‌లో ఈ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఓవర్సీస్‌లోనే బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.
2027 విజయ దశమికా?
మరోవైపు 'కల్కి 2' కాస్టింగ్ విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ సీక్వెల్ నుంచి దీపికా పదుకొనె తప్పుకోవడంతో, ఆమె స్థానంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ తన చేతిలో ఉన్న 'ఫౌజీ', 'స్పిరిట్' షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే ఆయన కల్కి సెట్స్‌లో అడుగుపెడతారు. 2027 వేసవికి లేదంటే విజయ దశమికి కల్కి2 విడుదలయ్యే అవకాశం కనపడుతోంది.












Click it and Unblock the Notifications