సూపర్‌స్టార్ ఇంటికి కోడలు కాబోతున్న అక్కినేని హీరోయిన్..?

కళ్యాణి ప్రియదర్శన్.. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, అలనాటి నటి లిజీ దంపతుల ముద్దుల కుమార్తె. స్టార్ కిడ్ అనే ముద్రకే పరిమితం కాకుండా తన నటనతోనే ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'హలో' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. నటిగా మాత్రం ఆమెకు గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన "చిత్రలహరి" మూవీలో నటించి మెప్పించింది.

ఆ తర్వాత మలయాళ చిత్రసీమపై ఎక్కువ దృష్టి పెట్టిన ఆమె.. ఇటీవల విడుదలైన ' లోక చాప్టర్ 1 : చంద్ర' సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా.. లేడీ సూపర్ హీరోయిన్ తరహా పాత్రలో అలరించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. కళ్యాణి కెరీర్‌లోనే కాకుండా మలయాళ చిత్ర పరిశ్రమలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పొందింది.

kalyani-priyadarshan-love-and-marriage-details-revealed-by-her-mother-and-comments-goes-viral

కాగా ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటీనటుల పెళ్లి వార్తలు కనిపిస్తున్నాయి. పలు ప్రేమ జంటలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే తన కూతురు పెళ్లి విషయంపై ఓపెన్ అయ్యింది కళ్యాణి ప్రియదర్శిని తల్లి.

ప్రస్తుతం తమిళంలో జినీ, మార్షల్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

కళ్యాణి.. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్‌తో కళ్యాణి డేటింగ్ చేస్తున్నట్లుగా ఎన్నో ఏళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు అని అందరికీ తెలిసిందే. వీరిద్దరి రిలేషన్‌పై పలుమార్లు వీరి కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ పుకార్లు మాత్రం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 2022లో ఈ జంట నటించిన హృదయం మూవీ మంచి విజయం సాధించింది. అందులో ప్రణవ్ - కళ్యాణిలు భార్యాభర్తలుగా నటించారు. ఈ క్రమంలో నిజ జీవితంలోనూ వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

లేటెస్ట్ గా ఈ వ్యవహరంపై కళ్యాణి ప్రియదర్శన్ తల్లి లిస్సీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కళ్యాణి - ప్రణవ్ మోహన్‌లాల్‌ల పెళ్లి కోసం మేం వెయిట్ చేస్తున్నామంటూ ఓ నెటిజన్లు కామెంట్ చేశాడు. దీనిపై సీరియస్ అయిన లిస్సీ వెంటనే అది తప్పుడు వార్త అంటూ రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఆమె క్లారిటీతో ఇకనైనా ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి. మరి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు పెళ్లి అనౌన్స్ మెంట్ ఇస్తారో అని జోరుగా చర్చ నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+