భారతీయుడు2తో అందరూ మునిగారు.. లాభపడింది అతనొక్కడే
భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారతీయుడు2 చిత్రం ఈనెల 12న విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటిరోజు మొదటి ఆట నుంచే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ శంకర్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారతీయుడు చిత్రం అద్భుతమైన సినిమా అని, అటువంటి సినిమాకు ఉన్న పేరును భారతీయుడు2 చెడగొట్టిందంటూ నిప్పులు చెరుగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో సినీ ప్రేక్షకులు ఈ సినిమాకు 1, 1.5.. రేటింగ్ ఇస్తున్నారు అంటే వారిని ఈ సినిమా ఎంత హింసకు గురిచేసిందో అర్థం చేసుకోవచ్చు.
లాభపడినా పేరు పోయింది
ఈ సినిమాకు పారితోషికంతోపాటు లాభాల్లో వాటా తీసుకున్నారు శంకర్. సినిమా పరాజయం పాలైన తర్వాత లాభాలు రావు. నిర్మాతతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు.. అందరూ నిండా మునిగిపోయారు. లైకా ప్రొడక్షన్స్ దీన్ని నిర్మించింది. ఈ సినిమా పరాజయంవల్ల కూడా లాభపడిన వ్యక్తి ఒకరే ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. విశ్వనటుడు కమల్ హాసన్. ఈ చిత్రం చేసేందుకు ఆయన రూ.75 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నారు. ఆయన ఒక్కడే ఈ చిత్రం చేయడంవల్ల లాభపడినప్పటికీ పేరుమాత్రం పోయింది.

వద్దని కమల్ చెబుతూనే ఉన్నారు
వాస్తవానికి ఈ సినిమా చేయవద్దని శంకర్ తో కమల్ చెబుతూనే ఉన్నారుకానీ ఆయన మాత్రం వినలేదు. అద్భుతంగా ఆడుతుందని తీశారుకానీ అక్కడే ఒక తప్పు చేశారు. భారతీయుడు3 అని పొడిగించకుండా కథను మొత్తం ఈ సినిమాలోనే చెప్పివుంటే సినిమా మంచి హిట్ అయివుండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ప్రధానమైన పాయింట్ ను మూడోభాగం కోసం ఉంచి హడావిడిగా సినిమాను చాపచుట్టినట్లు చుట్టేసి ప్రేక్షకుల మీదకు వదిలాని, వారు మొహమాటం లేకుండా తిరస్కరించారంటున్నారు. పెట్టిన పెట్టుబడి సంగతి దేవుడెరుగు.. ఖర్చులకైనా డబ్బులు వస్తే చాలు అంటున్నారు. ఈ సినిమా ఫ్లాపైన ప్రభావం తప్పకుండా రామ్ చరణ్ తో తీస్తున్న గేమ్ ఛేంజర్ పై ఉంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications