Kamal Haasan: కత్తి పట్టిన కమల్ హాసన్.. ఇక బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చే
కోలీవుడ్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఏడు పదుల వయసులోనూ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది థగ్ లైఫ్, ఇండియన్ 2, కల్కి సినిమాలతో అలరించారు. ఇక 2022 లో వచ్చిన విక్రమ్ సినిమా కమల్ హాసన్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.120 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్ల వరకూ కలెక్ట్ చేసి కమల్ హాసన్ స్టామినా ఏంటో చాలా ఏళ్ల తర్వాత చూపించింది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా తెరకెక్కుతున్న ధర్మన్ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఇటీవలే ప్రారంభం అయింది. ధర్మన్ చిత్రానికి యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో డ్రాగన్, ఓ మై కాదవులే లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఈ క్రమంలో రజినీకాంత్ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా కమల్ హాసన్ ఉండటం విశేషమనే చెప్పాలి.
தோ வாரேன் 🔥@ikamalhaasan #SUArunkumar#KamalHaasan #Mahendran@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/1GMUOdcSH6
— Raaj Kamal Films International (@RKFI) September 3, 2026
అయితే తాజాగా కమల్ హాసన్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిత్తా, వీర ధీర సూరన్ వంటి విభిన్న చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎస్. యూ. అరుణ్ కుమార్ తాజాగా కమల్ హాసన్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనుంది. ఈ మేరకు తాజాగా కమల్ హాసన్ పై షూట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్ షూట్ కు సంబంధించిన స్టిల్ ను తాజాగా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇందులో ఉలగనాయగన్ కమల్ హాసన్ ఓ చేత్తో కత్తి పట్టుకుని, స్టైలిష్ మీసం, గడ్డంతో పవర్ ఫుల్ లుక్ తో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్ మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ అండ్ ఇంటెన్స్ లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది.

విక్రమ్ సినిమాతో కమర్షియల్ సినిమాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేశారు కమల్ హాసన్. రెగ్యూలర్ ఫార్మాట్ స్టోరీస్ కు ఎండ్ చెప్పి స్టైలిష్ గా ఈ మూవీని ప్రెసెంట్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. అయితే ఇప్పుడు కూడా కమల్ హాసన్ ఈ మూవీలో బలమైన కంటెంట్, రియలిస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్ పై ఫోకస్ పెట్టాలని దర్శకుడు స్. యూ. అరుణ్ కుమార్ కు సూచించినట్లు సమాచారం. ఇక ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటులు అలాగే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ పైనా క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications