సెంట్రల్ జైలులో అర్దరాత్రి వరకు ఆ నటి ఏం చేసింది, బాయ్ ఫ్రెండ్ దూరంగా ఉంటే?
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ సహా 17 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణ అనంతరం నటుడు దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పవిత్ర గౌడను బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.
పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులోకి అడుగుపెడుతూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న పవిత్ర గౌడ కంటతడి పెట్టారని జైలు వర్గాలు తెలిపాయి. హీరో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ జైలులో రాత్రంతా సరిగ్గా నిద్రపోకుండా మెలకువగా ఉందని జైలు వర్గాలు అంటున్నాయి. అప్పటి వరకు నటి పవిత్ర గౌడ జీవితం చాలా బాగానే ఉండేది. అయితే హత్యకేసులో అరెస్టు అయిన నటి పవిత్ర గౌడకు ఇప్పుడు అసలు సినిమా కనపడుతోందని తెలిసింది.

పరప్ప అగ్రహార సెంట్రల్ జైలు గార్డు ఇచ్చిన చాపపై సుఖశాంతులతో పవిత్ర గౌడ నిద్రపోయిందా అని కన్నడ మీడియా ఆరా తీసింది. నటి పవిత్ర గౌడ సెంట్రల్ జైలులో ఎలా పడుకుంది అని అందరూ ఆరా తీశారు.
జైలు సిబ్బంది ఇచ్చిన చాప మీద కుర్చుని రాత్రంతా అశాంతితో ఉన్న పవిత్ర గౌడ సరిగా నిద్రపోకుండా కుర్చొని ఉందని తెలిసింది. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో లేచిన నటి పవిత్ర గౌడ బ్యారక్ చుట్టూ కాసేపు తిరుగుతూ వాకింగ్ చేసిందని, తరువాత న్యూస్ పేపర్ చదివి బయట జరుగుతున్న విషయాలు తెలుసుకుందని తెలిసింది.
ఆ తరువాత జైలు సిబ్బంది ఇచ్చిన కాఫీ తాగిన పవిత్ర గౌడ తరువాత ఆమె సెల్ లోకి వెళ్లిపోయిందని సమాచారం. జైలు సిబ్బంది, జైలు గార్డులు చిత్రన్నంను బ్రేక్ ఫాస్ట్ గా ఇస్తున్నారని తెలిసింది. పోలీసు కస్టడీలో ఉన్న దర్శన్ ఒంటరిగా ఉండి మానసికంగా కృంగిపోతున్నాడని తెలిసింది. నటి పవిత్ర గౌడ జైలుకు వచ్చిన రోజు నుంచి ఒంటరితనంతో ఆమెను ఓ రకంగా ఒంటరితనం వేధిస్తోందని తెలిసింది.
పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో మహిళా బ్యారెక్ లో తోటి ఖైదీలతో ఉన్నా దర్శన్ లేకుండా ఒంటరితనంతో పవిత్ర గౌడ బాధపడుతోందని జైలు సిబ్బంది గుసగుసలాడుతున్నారని తెలిసింది. పోలీస్ కస్టడీ ముగియడంతో దర్శన్ ను ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు. ఈనేపథ్యంలో దర్శన్ కోసం ఎదురుచూస్తున్న పవిత్ర గౌడ ఓసారి దర్శన్ ను చూడాలని అనుకుంటున్నదని తెలిసింది. పోలీసుల విచారణ అనంతరం హీరో దర్శన్ పరప్ప అగ్రహార సెంట్రల్ జైలుకు చేరే అవకాశం ఉంది. ఈరోజు విచారణ తర్వాత దర్శన్ భవితవ్యం తేలిపోనుంది.












Click it and Unblock the Notifications