వచ్చిందే ఛాన్స్.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన కన్నడ బ్యూటీ..!
తెలుగు చిత్ర పరిశ్రమలో కన్నడ భామల హవా నడుస్తోంది. రష్మిక మందన్నా, ఆషికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ రాణిస్తున్నారు. ఈ లిస్టులోకి మరో బ్యూటీ కూడా చేరింది. క్యూట్ బ్యూటీ "రుక్మిణీ వసంత్" ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. 2019లో 'బీర్బల్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
కానీ 2023లో వచ్చిన 'సప్త సాగరాలు దాటి' చిత్రంతో కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రంలో సహజమైన నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక తెలుగులో నిఖిల్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రంలో నటించినా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. అసలు ఆ సినిమా ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు వెళ్లింది అనే అనుమానం అందరిలో కలగకమానదు.

అలానే ప్రభాస్ - సందీప్ వంగా కాంబోలో తెరకెక్కనున్న 'స్పిరిట్' మూవీలోనూ రుక్మిణిని తీసుకుంటున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. కానీ ఆ మూవీలో త్రిప్తి దిమ్రిని తీసుకుంతున్నట్టు అఫిషియల్‌గా అనౌన్స్ చేయడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. ఇటీవలే విజయ్ సేతుపతితో కలిసి 'ఏస్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కూడా రుక్మిణీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్‌లో ఆమె పాల్గొన్నట్టు సమాచారం. అయితే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండడంతో ఈమె రెమ్యూనరేషన్ విషయంలో షాకింగ్ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఆమె ఇప్పటి వరకు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే పదిరెట్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. మేకర్స్ కూడా ఆమె క్రేజ్, యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని అడిగినంత పారితోషికాన్ని ఆమోదించారట. టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్న టాక్ ప్రకారం.. ఎన్టీఆర్ - నీల్ మూవీ కోసం రూ. కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు అనుకుంటున్నారు. అంతే కాకుండా ఆమె చేయబోయే సినిమాల విషయంలో కూడా దర్శక నిర్మాతలకు రుక్మిణి గట్టి డిమాండ్లు పెడుతున్నట్లు భావిస్తున్నారు. చూడాలి మరి ఈ భామ తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తుందో అని.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
'భర్త చనిపోయిన వెంటనే ప్రియుడితో వెళ్లిపోయింది'.. ఆ హీరోయిన్ పై ట్రోల్స్..!! -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో












Click it and Unblock the Notifications