మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేయనున్న కన్నడ హాట్ బ్యూటీ..!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే vfx కారణంగా సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక సాంగ్ మినహా వర్క్ మొత్తం ఫినిష్ అయిందని అంటున్నారు. కాగా ప్రస్తుతం సినీ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. ఈ సాంగ్ ను ఫినిష్ చేసేందుకు వశిష్ట రెడీ అవుతున్నారట. అంతే కాకుండా ఈ స్పెషల్ సాంగ్ కోసం కీరవాణిని కాకుండా భీమ్స్ సిసిరోలియోను రంగంలోకి దింపుతున్నారట.

kannada-beauty-niswika-naidu-goig-to-dance-with-megastar-chiranjeevi

చిరు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ వేరు. ఖైదీ నంబర్ 150 రాయ్ లక్ష్మీ, వాల్తేర్ వీరయ్యలో ఊర్వశి రౌతేలా అదరగొట్టారు. అందుకే ఇప్పుడు కూడా ఫుల్ మాస్ బీట్ తో వింటేజ్ చిరు స్టెప్పులు మిక్స్ చేసి ఆడియన్స్ ని ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఈ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. మెగాస్టార్ట్ సరసన ఈ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయడానికి ఓ కొత్త భామను ఓకే చేసినట్టు తెలుస్తోంది.

ఈ స్పెషల్ సాంగ్ కోసం కన్నడ హాట్ బ్యూటీ "నిశ్విక నాయుడు" ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో ప్రభుదేవతో కలిసి ఓ సాంగ్ లో డాన్స్ అదరగొట్టింది నిశ్విక. దాంతో ఇప్పుడు మళ్లీ చిరుతో నిశ్విక ఏ రేంజ్ లో డాన్స్ చేస్తుందో అని చర్చ నడుస్తోంది. మరి చాలా కాలం తర్వాత చిరుతో సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్న వశిష్ట.. మళ్లీ స్క్రీన్ పై మ్యాజిక్ ని రిపీట్ చేస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

మరోవైపు మెగాస్టార్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబోలో ఓ సినిమా చేస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనుండగా.. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని టాక్ నడుస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా ఫిక్స్ అవ్వగా ప్రస్తుతం రెండో షెడ్యూల్ ని కూడా ఫినిష్ చేసేశారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+