స్టార్ హీరోకు ఝలక్, షాక్ లో ఫ్యాన్స్, ఆ సినిమాల కథ కంచికి
స్యాండిల్ వుడ్ ఛాలెంజింగ్ హీరో దర్శన్ బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో హీరో దర్శన్ అరెస్ట్ అయ్యి మూడు నెలలకు పైగా అయ్యింది. కన్నడ హీరో దర్శన్ బెయిల్ పై బయటకు వస్తారని ఆయన అభిమానులకు మూడున్నర నెలలుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
అయితే ఓ సామాన్యుడి హత్య కేసులో ఏ2 నిందితుడైన హీరో దర్శన్ బెయిల్ పిటిషన్ వాదనలు జరుగుతున్నా ఆయనకు మాత్రం బెయిల్ రావడం లేదు. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కు బెయిల్ రాకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ అడ్డుపడుతూనే వస్తున్నారు. హీరో దర్శన్ ను బెయిల్ మీద బయటకు తీసుకురావాలని ప్రముఖ క్రిమినల్ లాయర్ అనేకవిధాలుగా ప్రయత్నించినా ఏమాత్రం ఫలితం లేకుండా పోతుంది.

హీరో దర్శన్ ను బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి ఆయన కుటుంబ సభ్యులకు కూడా అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రేణుకస్వామి హత్య కేసులో హీరో దర్శన్ బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇదే హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఏ1 అరోపి అయిన కన్నడ నటి పవిత్ర గౌడ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంది. నటి పవిత్ర కూడా హీరో దర్శన్ తో పాటు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది.
బెంగళూరులోని 57వ సీసీహెచ్ కోర్టులో హీరో దర్శన్ బెయిల్ పిటీషన్ విచారణ జరిగింది. ఆ సందర్భంలో హీరో దర్శన్ తో పాటు పవిత్ర గోడకి బెయిల్ మంజూరు చేయకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ కోర్టుకు మనవి చేశారు. హీరో దర్శన్ బెయిల్ కోసం ఆయన న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. అయితే హీరో దర్శన్, నటి పవిత్ర గౌడలకు మాత్రం బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది.
హీరో దర్శన్ బెయిల్ మీద బయటకు వస్తాడని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన ఆయన అభిమానులు నిరాశకు గురైనారు. తనకు బెయిల్ రాలేదని తెలుసుకు హీరో దర్శన్ బళ్లారి సెంట్రల్ జైల్లో లో కుమిలిపోతున్నాడని సమాచారం. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంటున్న నటి పవిత్ర గౌడ బెయిల్ రాకపోవడంతో కుమిలిపోయిందని సమాచారం. మొత్తం మీద హీరో దర్శన్, నటి పవిత్ర గౌడలకు ఇంకా కొన్ని రోజులు జైలులోనే గడపాల్సి ఉంది.












Click it and Unblock the Notifications