స్టార్ హీరోతో హీరోయిన్ సహజీవనం, హత్యకు ప్లాన్ చేసింది ఫస్ట్ ? చార్జ్ షీట్ లో?
రేణుకాస్వామి హత్యకేసులో పోలీసులు సమర్పించిన చార్జ్ షీట్ లోని సమాచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. శ్యాండిల్ వుడ్ హీరో దర్శన్ అండ్ గ్యాంగ్ చాలా దారుణానికి ఒడిగట్టింది. ఫేక్ అకౌంట్ ద్వారా మెసేజ్ లు పంపుతున్న రేణుకాస్వామిని దర్శన్ గ్యాంగ్ చాకచక్యంగా గుర్తించి బెంగళూరుకు పిలుచుకుని వచ్చి దారుణంగా హత్య చేశారని పోలీసులు చార్జ్ షీట్ లో వివరాలను కోర్టుకు సమర్పించారని కన్నడ మీడియా తెలిపింది.
ఊరు, పేరు, ఎలాంటి గుర్తింపు తెలియని ఫేక్ అకౌంట్‌లో అసలు వ్యక్తి ఎవరనే దానిపై దర్శన్ గ్యాంగ్ సినిమా స్టైల్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిందని, పక్కాప్లాన్ లో రేణుకాస్వామిని హత్య చేశారని పోలీసులు కోర్టుకు చార్జ్ షీట్ సమర్పించారు. దర్శన్ అండ్ గ్యాంగ్ కు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని ఛార్జ్ షీట్‌లో పోలీసులు వివరించారు.రేణుకాస్వామి ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కన్నడ నటి. దన్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడకు అసభ్యంగా మెసేజ్ లు, ఫొటోలు పంపించాడని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

రేణుకాస్వామి pavitragowda777_official ఖాతాకు అసభ్యంగా మెసేజ్ లు పంపించాడు, ఇన్‌స్టాగ్రామ్‌లోనాలుగు అకౌంట్లు కలిగి ఉన్న పవిత్ర గౌడ ఎక్కువగా రేణుకాస్వామి మెసేజ్ లు పంపించిన అకౌంట్ ను ఎక్కువగా ఉపయోగించింది. హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని పోలీసులు చార్జిషీట్ పేర్కొన్నారు.రేణుకాస్వామి ఫేక్ అకౌంట్ల ద్వారా అసభ్యకరమైన ఫోటోలు, మెసేజ్ లు పంపుతున్న విషయాన్ని పవిత్ర గౌడ తన సన్నిహితులు పవన్, వినయ్ లకు చెప్పంది.
వీరిద్దరూ ఈ సమాచారాన్ని నటుడు దర్శన్‌కి చెప్పారు. వెంటనే రేణుకాస్వామిని కనిపెట్టి బెంగళూరుకు తీసుకురావాలని హీరో దర్శన్ ఆ ఇద్దరికి సూచించాడు.ఫిబ్రవరి 24వ తేదీన పవిత్ర, పవన్, వినయ్ కలిసి ప్లాన్ చేశారు. అనంతరం పవిత్ర గౌడ పక్కాప్లాన్ ప్రకారం హత్యకు గురైన రేణుకాస్వామితో సోషల్ మీడియాలో తీరికలేకుండా చాటింగ్ చెయ్యడం మొదలుపెట్టింది. జూన్ 3వ తేదీన రేణుకాస్వామి మెసేజ్ కు పవిత్ర గౌడ వెంటనే సమాధానం ఇచ్చింది.
తరువాత ఫేక్ అకౌంట్‌లో ఉన్న రేణుకాస్వామిని ట్రేస్ చేయాలని పవిత్ర గౌడ, ఆమె అనుచరులు ఇద్దరూ ప్లాన్ చేశారు. పవిత్ర గౌడ డ్రాప్ మీ యువర్ నంబర్ అని రీప్లే చేసింది. చాటింగ్ చేస్తూ పవిత్ర గౌడ తన నంబర్ అడుగుతున్నదని రేణుకాస్వామి క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఫోన్ నెంబర్ ఎందుకు, నా ఇంటి అడ్రసె లోకేష్ షేర్ చేస్తానని రేణుకాస్వామి కూడా రిప్లే ఇచ్చాడు. వెంటనే రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అతని ఇంటి లోకేష్ షేర్ చేశాడు.

ఫోన్ నెంబర్ ఎందుకు పా ఇంటి లొకేషన్‌తో సహా అన్నీ పంపిస్తానని పవిత్ర గౌడకు చెప్పి ఆమె అకౌంట్ కు లోకేష్ పంపించడానికి సిద్దం అయ్యాడు.నటి పవిత్ర గౌడ ఈ నంబర్‌ను సంపాదించి పవన్‌కు పంపించింది. పవిత్ర గౌడ నేనే అంటూ రేణుకాస్వామితో పవన్ చాటిం్ చెస్తూ చిత్రదుర్గ చేరుకున్నాడు. పవన్. చాటింగ్‌లో రేణుకాస్వామి తన ఇంటి అడ్రస్, ఎక్కడ పని చేస్తున్నాను అని అతని వ్యక్తిగత వివరాలు అన్నీ పవన్ కు చెప్పాడు.
ఇక్కడి నుంచి రేణుకాస్వామి ఆపరేషన్ మొదలైంది. దర్శన్ గ్యాంగ్ నెంబర్, లొకేషన్ అంతా రాబట్టి చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని ట్రేస్ చేసింది. సినిమా స్టైల్లో బెంగళూరుకు రేణుకాస్వామిని పిలుచుకుని వచ్చి అతన్ని చంపేశారని బెంగళూరు పోలీసులు చార్జిషీట్‌లో వివరాలు పొందు పరిచి కోర్టుకు సమర్పించిందని కన్నడ మీడియా తెలిపింది. మొత్తం మీద పోలీసుల చార్జ్ షీట్ తో హీరో దర్శన్, అతని గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ పవిత్ర గౌడకు అసలు సినిమా కనపడుతా ఉందని కన్నడిగులు గుసగుసలాడుతున్నారు.












Click it and Unblock the Notifications