Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దిమ్మతిరిగిపోయే శివన్న, ప్రభుదేవా కాంబినేషన్, యాక్షన్, డ్యాన్స్, కరటక దమనక ఎలా ఉందంటే!

శ్యాండిల్ వుడ్ లో ఈవారం రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. యోగరాజ్ భట్ దర్శకత్వం వహించిన కరటక దమనక. మరొకటి గురు ప్రసాద్ దర్శకత్వం వహించిన రంగనాయక. రెండు సినిమాలపైనా అభిమానుల్లో అంచనాలకు ఏమాత్రం కొదవలేదు. ముఖ్యంగా సెంచరీ స్టార్ శివరాజ్‌కుమార్, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కాంబినేషన్‌లో వచ్చిన కరటక దమనక సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

డాక్టర్ శివరాజ్ కుమార్ కలిసి మొదటి సారి యోగరాజ్ భట్ సినిమా తీశారు. శివరాజ్ కుమార్, ప్రభదేవా కలిసి నటించిన తొలి సినిమా కూడా ఇదే. అదేవిధంగా ప్రభుదేవా సినిమాకు యోగరాజ్‌ భట్‌ దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇదే. తొలిరోజు కరటక దమనక ఫస్ట్ షో చూడాలని చాలా మంది ఎదురుచూసి చివరికి సినిమా చూసేశారు. భారీ చిత్రాలను నిర్మించే బహుబాష చిత్రాల నిర్మాత రాక్‌లైన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌కు నిర్మించింది. ప్రియా ఆనంద్, నిశ్విక నాయుడు, కిలాడీ కామెడీ గ్యాంగ్, రవిశంకర్, రంగాయణ రఘు, తనికెళ్ల భరణి తదితర కళాకారులు ఈ సినిమాలో నటించారు. యోగరాజ్ భట్ దర్శకత్వం వహించిన కరటక దమనక సినిమా ఎలా ఉంది అంటూ రకరకాలుగా చర్చ మొదలైయ్యింది.

Kannada movie Karataka Damanaka starring Shivraj Kumar and Prabhu Deva is a super hit by fans

కరటక దమనక కథ ఏమిటింటే ?

జిత్తులమారి నక్కల స్వభావాన్ని పోలిన కథ కరటక దమనక శివన్న, ప్రభుదేవా ఇద్దరూ ఆ కుటిల స్వభావాన్ని కలిగిన నక్కల్లా నటించారు. ఊరును మోసం చేసి, దొంగతనాలు చేస్తూ జీవనం సాగించే మోసగాళ్లలా శివరాజ్ కుమార్, ప్రభుదేవా అదిరిపోయాలా నటించారు. మరోవైపు నీటి కోసం అల్లాడుతున్న ఉత్తర కర్ణాటకలోని ఒండూరు ప్రజలు. నీళ్ల కోసం రాజకీయం చేసే వాళ్లు, కొంతమంది ప్రజలు నీటి వసతి లేకుండా నగరాల్లో తమ జీవితాలని నిర్ణించుకుని సిటీలకు వెళ్లిపోవాలని అనుకున్నవాళ్లు, ఎలాంటి కష్టాలు వచ్చినా అదే ఊరిలో బతకాలని కొందరు అనుకుంటుంటారు. అలాంటి ఊరిలోకి కరటక దమనకా లాంటి జిత్తులమారి నక్కలు ప్రవేశించిన తరువాత ఆ ఊర్లో ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథ.

యోగరాజ్ భట్ కన్నడ సినీ ప్రేక్షకులకు తెలిసిన కథతోనే మరోసారి సినిమా తీశారు. కథతో పాటు డైలాగులకు కూడా ఆయన స్టైల్ లో ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. కరటక దమనకా సినిమా కథ మూడు కోణాల్లో సాగుతుంది. ప్రేక్షకులకు సందేశాన్ని అందించడమే దర్శకుడు యోగరాజ్ భట్ ప్రధాన ధ్యేయం అని ఈ సినిమాతో వెలుగు చూసింది. గతంలో ముంగారుమలే లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాను అందించిన యోగరాజ్ భట్ తరువాత కొన్ని సినిమాలు తీశారు. ముంగారుమలే సినిమా శ్యాండిల్ వుడ్ ను ఓఊపుఊపేసిన విషయం తెలిసిందే.

Kannada movie Karataka Damanaka starring Shivraj Kumar and Prabhu Deva is a super hit by fans

శివన్న-ప్రభుదేవా కాంబినేషన్ ఎలా ఉంందంటే?

శివన్న, ప్రభుదేవా ఇద్దరూ అనుభవం ఉన్న నటులే. పైగా ప్రభుదేవా తెలుగు, హిందీలో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు ప్రభుదేవా ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇలా ఇద్దరిని నటనా సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేదు. ఇద్దరూ ఇద్దరే అనే లాగా నటించారు. అయితే ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు చాలా కొత్త కావడంతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ శివన్న ఎనర్జీ ప్రత్యేకంగా నిలిచింది.

యాక్షన్, డైలాగ్స్, డ్యాన్స్ ఇలా అన్నింటికీ శివన్నను చూసి ఆయన అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. మరోవైపు ప్రభుదేవా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రభుదేవా కామిడీ, డ్యాన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయని అభిమానులు అంటున్నారు. శివరాజ్ కుమార్, ప్రభుదేవా మొదటిసారి ఒకే సినిమాలో నటించడంతో కరటక దమనక విడుదల అయిన సినిమా థియేటర్లు అన్ని మొదటి రోజు ఫుల్ అయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+