హనుమాన్ పాత్రలో కన్నడ స్టార్ హీరో.. పోస్టర్ రీలీజ్..
తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి బాక్సులు బద్దలుకొట్టింది. ఇక, ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన విషయం విదితమే. అయితే, ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా ఉంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటీ ? అనే ప్రశ్నకు సమాధానమే హనుమాన్ సెకండ్ పార్ట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు కొనసాగింపుగానే జై హనుమాన్ చిత్రాన్ని తీసుకురానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో హనుమాన్ సెకండ్ పార్ట్ పై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా జై హనుమాన్ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఇక, ఈ సినిమాకు సంబంధించి మూవీ మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్ఆచరు. జై హనుమాన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ నెల (అక్టోబర్) 30న విడుదల చేసి అభిమానులకు దీపావళి కానుక ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
ఇక, ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో ఎవరూ కనిపించనున్నారని ఫస్ట్ నుంచి అందరూ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అయితే, కొత్తగా రీలీజ్ చేసిన పోస్టర్‌తో ఆ ఉత్కంఠకు తెరపడింది. హనుమాన్ పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక, పోస్టర్ అందరీని ఆకట్టుకుంటుంది.

ఆ పాత్రపై క్లారిటీ...
హనుమాన్ సినిమాలో హీరోగా తేజ సజ్జా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ సక్సెస్‌ను చివిచూసింది. జై హనుమాన్ సినిమాలో ఆంజనేయుని పాత్రను ఓ స్టార్ హీరో పోషిస్తారని గతంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం విదితమే. అయితే, ఈ పాత్రపై టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. తాజాగా ఇప్పుడు హనుమాన్ పాత్ర ఎవరూ చేస్తున్నారనే విషంపై మాత్రం ఓ క్లారిటీ వచ్చేసింది.
సెకండ్ పార్ట్‌లో శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటన్నది ముఖ్యమైన అంశంగా ఉండనున్నది. జై హనుమాన్‌లో కూడా తేజ సజ్జా హనుమంతు పాత్రలోనే కనిపించనున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ ఈ చిత్రంతోపాటు అధీర, మహాకాళి సినిమాలను కూడా తీస్తున్నారు.
In the spirit of Diwali and the guiding light of the divine ✨
— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2024
Honoured to be teaming up with the National Award-winning actor @shetty_rishab sir and the prestigious @MythriOfficial to bring our grand vision #JaiHanuman 🙏🏽
Let’s begin this DIWALI with the holy chant JAI HANUMAN… pic.twitter.com/i2ExPsflt2












Click it and Unblock the Notifications