'కన్నప్ప' రివ్యూ..ఒక్క ముక్కలో తేల్చేశారుగా..
'కన్నప్ప' ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా, ముకేశ్ కుమార్ దర్శకత్వంలో, మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ నటులు నటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పదేళ్లుగా విష్ణు పడ్డ కష్టం ఈ సినిమాతో ఫలిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.
ప్రేక్షకుల టాక్: ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ బ్లాక్‌బస్టర్!
మార్నింగ్ షో చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందని, అయితే సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయిందని ఏకగ్రీవంగా చెబుతున్నారు. తొలి భాగంలో చెప్పుకోదగ్గ సన్నివేశాలు తక్కువగా ఉన్నప్పటికీ, దర్శకుడు రెండో భాగంలో సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారట.

ముఖ్యంగా, ప్రభాస్ ఎంట్రీ, విష్ణు నటన సినిమాకు ప్రధాన బలంగా మారాయని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. క్లైమాక్స్‌లో చివరి 20 నిమిషాలు విష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక నెటిజన్ పోస్ట్ చేస్తూ, ఫస్ట్ హాఫ్‌లో బీజీఎమ్, కొన్ని సీన్స్ తప్పితే చెప్పుకోదగ్గవి లేవు. కానీ, ద్వితీయార్థంలో ప్రభాస్, విష్ణు స్క్రీన్ ప్రజెన్స్, నటన, విజువల్స్ సినిమాకు హైలైట్ అని పేర్కొన్నారు.
#Kannappa Review :
— Nikhil raj (@Nikhilpushpa847) June 26, 2025
1st half bgm and some sence are worth migtha motham dolaa...
2nd half lo last 15 to 20 min acting of @iVishnuManchu anna kuta ramp u asaluu 🔥🔥🔥🔥 screen presence mind-blowing 🙏🔥🔥
And second half lo #prabhas entry and screen presence worth movie.. pic.twitter.com/5sPKpx3cTN
మరో నెటిజన్.. ప్రీ-ఇంటర్వెల్‌లో సినిమా ఊపందుకుంటుంది. సెకండ్ హాఫ్‌లో దర్శకుడు భక్తితో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందని పోస్ట్ చేశారు.
మొత్తంగా 'కన్నప్ప' సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్ టాక్ లభించింది. ముఖ్యంగా సెకండాఫ్, విష్ణు నటన, ప్రభాస్ ఎంట్రీ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి.
-
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
Varanasi ఊచకోత.. కేవలం ఓవర్సీస్లో రైట్స్‌కే అన్ని రూ.కోట్లా? -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications