రాజమౌళి సినిమాల్లో లాజిక్ గురించి కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్. ఇప్పటికే ఆయన పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా , ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. అలాగే సెలబ్రెటీల వారసులను ఇండస్ట్రీ కి పరిచయం చేయాలంటే ముందుగా కరణ్ నే సంప్రదిస్తారు. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా.. అన్ని సినీ పరిశ్రమల్లోనూ కరణ్ జోహార్ కి మంచి మంచి సంబంధాలు ఉన్నాయి.

అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోష‌ల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడూ త‌న‌కు సంబంధించిన విష‌యాల‌తో పాటు సినిమాల వివ‌రాల‌ను పంచుకుంటూ ఉంటాడు కరణ్. తెలుగు ఆడియన్స్ కి కూడా ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరణ్ జోహార్ సినిమాల విషయంలో ఎంత యాక్టివ్ గా ఉంటారో.. బయట కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా రాజమౌళి గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Karan Johar s shocking comments about logic in Rajamouli s movies

లాజిక్ వెతక్కూడదు..

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మనం తీసిన సినిమాపై మనకు నమ్మకం ఉంటే, ప్రేక్షకులు ఆ సినిమాలో లాజిక్ గురించి పట్టించుకోరని అన్నారు. ఉదాహరణకు రాజమౌళి సినిమాలు తీసుకుంటే ఆయన చిత్రాలలో లాజిక్ గురించి ఎప్పుడు ప్రేక్షకులు మాట్లాడలేదు. దానికి కారణం వారికి ఆయన కథపై ఉన్న నమ్మకమే అని చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సన్నివేశాలను తెరకెక్కించగలరు రాజమౌళి అని ప్రశంసలు గుప్పించారు.

అంతే కాకుండా యానిమల్, గదర్ వంటి చిత్రాలకు కూడా ఇదే వర్తిస్తుందని తెలిపారు. గదర్ 2 లో హీరో 1000 మందిని కొడుతున్నట్లు చూపించారని.. కానీ అది సాధ్యమా.. కాదా అని ఎవరు చూడలేదన్నారు. నమ్మారు కాబట్టే ప్రేక్షకులు ఆదరించి సినిమాలను సూపర్ హిట్ చేశారన్నారు. అందుకే సినిమా విజయం పూర్తిగా నమ్మకం పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. లాజిక్ గురించి ఆలోచించకుండా సినిమాను ఎంజాయ్ చేస్తూ చూడాలని సలహా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+