రష్మికను ఆ పని చేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నపై అధికార పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కర్నాటక ఎమ్మెల్యే రవి గనిక రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు రష్మిక దూరంగా ఉన్నారు. దీంతో ఆమెపై ఎమ్మెల్యే రవి గనిక అసహనం వ్యక్తం చేశారు. రష్మికకు గుణపాఠం నేర్పించాలని ప్రజలకు, అభిమానులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బెంగళూరు వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా సినీ నటులు హాజరు కాలేదు.
దీంతో అక్కడి ప్రభుత్వం సినీ ప్రముఖులపై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే రష్మికపై ఎమ్మెల్యే రవి గనిక రష్మిక తీరును తప్పు పట్టారు. బెంగుళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. కెరీర్‌ను ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని.. రష్మికకు సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. 'రష్మిక కన్నడ సినీ పరిశ్రమ, భాష పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా.?' అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.షూటింగ్ బిజీలో ఉండటం వల్లే రష్మిక ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది.

మరోవైపు రష్మిక కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా మారిపోయింది. రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.ఆమె తాజాగా నటించిన పుష్ప 2: ది రూల్,ఛావా వంటి సినిమాలు కూడా హిట్ కావడంతో రష్మిక రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అరడజనకు పైగా సినిమాలతో అమ్మడు బిజీగా మారింది. రష్మిక సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్టే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది.సికిందర్,కుబేరా,ది గర్ల్ ఫ్రెండ్,థామా,రెయిన్బో వంటి సినిమాల్లో రష్మిక నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో రష్మికనే హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications