Karthika deepam 2 December 9th:గురిచూసి కొట్టిన కార్తీక్-పారిజాతానికి శిక్ష..!!

'కార్తీకదీపం 2' సీరియల్‌లో నేటి ఎపిసోడ్ (536వ ఎపిసోడ్) పారిజాతం (పారు)కు ఎదురుదెబ్బ తగలడం, దీప మొండి నిర్ణయానికి శివన్నారాయణ ఫ్యామిలీలో దక్కిన మద్దతు, మరియు శ్రీధర్ ఇంటి కలహాల చుట్టూ ఉత్కంఠగా సాగింది. ముఖ్యంగా శౌర్య అమాయకపు మాటలతో పారిజాతం కుట్ర బట్టబయలవడంతో పెద్దాయన ఆమెకు కఠిన శిక్ష వేశారు.

పారిజాతం కుట్ర బద్దలు:శౌర్య నోట నిజం..
గత ఎపిసోడ్‌లో అత్తయ్య కాంచన (అవిటిదిగా ఉన్నప్పటికీ) సేవలు చేయడం తన అదృష్టమని చెప్పి, శివన్నారాయణ గారింటికి వెళ్లడానికి దీప అనుమతి పొందిన సంగతి తెలిసిందే. నేటి ఎపిసోడ్‌లో పెళ్లి షాపింగ్ గురించి మాట్లాడిన పారిజాతం, జ్యోత్స్న పెళ్లి మీద తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, దీప కూతురు శౌర్య మనసు విరగొట్టానని గర్వంగా చెబుతుంది.

karthika-deepam-2-serial-december-9th-episode-536-here-is-todays-full-story

అదే సమయంలో కార్తీక్, దీప, శౌర్యలు శివన్నారాయణ ఇంటికి రావడంతో పారిజాతం షాక్ అవుతుంది. శౌర్య వచ్చి ముద్దుల తాత శివన్నారాయణను కాకుండా, పారిజాతంను హగ్ చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. పారిజాతంపై అంత ప్రేమ ఎందుకని శివన్నారాయణ అడగగా, "జో గ్రానీ నాకు చాలా మంచి విషయాలు చెప్పింది," అని శౌర్య అంటుంది.

పాప చెప్పిన విషయాలు విని శివన్నారాయణ, కార్తీక్‌లు రగిలిపోతారు. శౌర్య నోట నిజం బయటికి వస్తుంది: "మా మమ్మీ బొజ్జలో ఉన్న బేబీ మీద ప్రేమతో మా నాన్న సరిగా చూసుకోడట, మా అమ్మకి నా పైన ప్రేమ తగ్గిపోతుందట, నన్ను ఎవరికైనా ఇచ్చేస్తారని జో గ్రానీ చెప్పిందని" శౌర్య అనడంతో పారిజాతం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి.

గురి చూసి శిక్ష వేసిన శివన్నారాయణ
చిన్నపిల్లల మనసు పాడుచేసే వారిని ఏం చేయాలని కార్తీక్‌ని అడిగిన శివన్నారాయణ, దీపను ఆ శిక్షను వేయమని అడుగుతాడు. దీప కోరిక మేరకు పెద్దాయన సంచలన శిక్ష విధించారు."ఈరోజు దీప పనులన్నీ పారిజాతమే చేయాలి. కార్తీక్ నీతో పనులన్నీ చేయిస్తాడు. కార్తీక్ నీకు 10కి 10 మార్కులు ఇవ్వకపోతే రేపు మరోసారి పనిమనిషివి కావాల్సిందే!"నా కూతురిని అడ్డు పెట్టుకుని తనను ఇంట్లోనే పనిమనిషిని చేయిస్తావా అని పారిజాతం కార్తీక్‌పై రగిలిపోతుంది. కిచెన్‌లో పారుతో కార్తీక్ పనులు చేయించడం, దీపకు ఫ్రూట్స్ కట్ చేసి తినిపించమని కార్తీక్ ఆదేశించడంతో పారిజాతానికి చుక్కలు కనిపిస్తాయి.

శ్రీధర్ ఇంట అశాంతి
మరోవైపు, కాశీతో కలిసి ప్రెజెంటేషన్‌కి వెళ్లిన శ్రీధర్.. సాయంత్రం గుడికి రావాలని స్వప్న ఫోన్ చేయగా నిరాకరిస్తాడు. డ్యూటీ టైం అయ్యాకే ఇంటికి వెళ్లాలని చెప్పడంతో స్వప్న కోపంతో రగిలిపోతుంది. "మా ఆయన సీఈవో... మీ ఆయన పీఏ," అంటూ స్వప్న విసుక్కోవడంతో కావేరి విసుగు చెంది, "మీ నాన్నని అడగమని" చెప్పి తప్పించుకుంటుంది. శ్రీధర్ మాత్రం "నాకు కాంచన, నువ్వు ఇద్దరూ కావాలి. ఇప్పటికే ఒక ఆడదానిని ఏడిపిస్తున్నాను, మరో ఆడదానిని ఏడిపించలేను," అని కావేరికి మాటిస్తాడు.మొత్తంగా, పారిజాతం కుట్ర బద్దలవడం, ఆమెకు శిక్ష పడటం, దీప, కార్తీక్‌ల రాకతో శివన్నారాయణ ఇంట్లో కొత్త ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+