Karthika deepam 2 November 13th:జ్యోత్స్న పరువు నష్టం..శ్రీధర్ సీఈవో వెనుక అసలు రహస్యం ఇదే..!!
దీప, బావలను కాదని శివన్నారాయణ కొత్త సీఈవోగా సూటు, బూటులో వచ్చిన శ్రీధర్‌ను నియమించారు. తనను రాజీనామా చేయమని ఆదేశించడంతో జ్యోత్స్న రగిలిపోయింది. అవమాన భారంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి జ్యోత్స్న సిద్ధం కాగా, కుటుంబ సభ్యులు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు.
నేటి 514వ ఎపిసోడ్ హైలైట్స్ (నవంబర్ 13)
'వెళ్లిపో' అన్న శివన్నారాయణ: షాక్‌లో కుటుంబం
ఇల్లు వదిలి వెళ్లిపోతానన్న జ్యోత్స్నను ఆపడానికి శ్రీధర్ ప్రయత్నించారు. ఆమెపై కోపం లేదని, ఆమె కోసమే కంపెనీలో ఉంటానని చెప్పినా జ్యోత్స్న వినలేదు. "చేతులు కట్టుకుని నిలబడే జీవితానికి చోటిస్తే ఎగిరి గంతేస్తారు, కానీ శాసించే స్థాయిలో ఉన్నవారికి చిన్న అవమానం అడవిలో నిప్పు రవ్వ లాంటిది" అని చెప్పి, తనకు జరిగిన అవమానం చాలు, తాను వెళ్లిపోతానని తేల్చి చెప్పింది.

అప్పుడు శివన్నారాయణ కోపంగా "వెళ్లిపో!" అని అరిచారు. ఆయన మాటలకు అందరూ షాక్ అయ్యారు. "వెనుకా ముందు ఆలోచించని తొందరపాటే నీ చేత ఈరోజు మరో తప్పు చేయిస్తుంది. మేం ఎవ్వరూ నీకు వద్దు అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కటే" అని అన్నారు. పారిజాతం బాధలో అలా మాట్లాడతారా అని సీరియస్ అయినా, జ్యోత్స్న భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటానని శివన్నారాయణ అన్నారు.
దశరథ్ జోక్యం చేసుకుని, జ్యోత్స్న సంతోషం కోసం తాను తాతయ్యను ఒప్పిస్తానని కార్తీక్ చెప్పినా, జ్యోత్స్న మాత్రం ససేమిరా అంది. చివరకు సుమిత్ర జోక్యం చేసుకుని, "బాధ్యతల కోసం పరిగెత్తే జీవితం వద్దని, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం" అని చెప్పి, తల్లిగా తాను ఇంతకు మించి ఏమీ కోరుకోవడం లేదని ఆమె లగేజీని లోపలికి తీసుకెళ్లడంతో జ్యోత్స్న ప్రయాణాన్ని విరమించుకుంది.
శ్రీధర్‌కు జ్యోత్స్న అసిస్టెంట్! పారిజాతం సెటైర్లు
శ్రీధర్ కంపెనీకి లాభనష్టాలు, ఇతర వివరాలన్నీ జ్యోత్స్ననే చెప్పాలని ఆదేశించారు. ఆమె ఆఫీస్‌లో అసిస్టెంట్ కాదు, ఛైర్మన్‌గారి మనవరాలి పోస్ట్‌లో ఉంటుందని కార్తీక్ సర్ది చెప్పాడు.
కార్తీక్ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నాడని పారిజాతం సెటైర్లు వేసింది. కార్తీక్‌ను డ్రైవర్‌గా కట్టడి చేయడం వల్లే జ్యోత్స్న రెస్టారెంట్ మిగిలి ఉందని, లేదంటే తన కొడుకు స్పీడుకు సత్యరాజ్ రెస్టారెంట్ మరో నాలుగు బ్రాంచ్‌లు విస్తరించేవని శ్రీధర్ అనడంతో పారిజాతం షాక్ అయ్యింది. జ్యోత్స్న తెలివితేటల వల్లే కంపెనీ నిలబడిందని పారు అనగా, "చావుబతుకుల మధ్య ఉన్న మనిషిని నిలబెట్టి అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకోవడం తెలివితేటలు కాదు, అది స్వార్థం, మానవత్వం లేకపోవడం" అని దీప గట్టిగా సమాధానమిచ్చింది.
శ్రీధర్‌ను సీఈవో చేసిన అసలు కారణం ఇదే!
కార్తీక్‌ను విడిగా తీసుకెళ్లిన శివన్నారాయణ తన నిర్ణయం వెనుక అసలు కారణాన్ని వెల్లడించారు. కార్తీక్ సీఈవో అయితే జ్యోత్స్న అడ్డుపడుతుందని, దీప కూడా పదవి వదులుకుందని, అందుకే ముందే అనుకున్నట్లుగా శ్రీధర్‌నే సీఈవో చేశానని చెప్పారు.
"మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడనే మీ అమ్మ ముందు కొట్టి, ఇంటి నుంచి గెంటేశాను. నేను చేసిన తప్పే నా కూతురు కూడా చేసింది. నేను తొందరపడకుండా ఉంటే నా కూతురు భర్త లేని ఆడదానిలా ఉండేది కాదు" అని శివన్నారాయణ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన కూతురికి న్యాయం చేయాలంటే కార్తీక్ తండ్రిని క్షమించాలి అని, శ్రీధర్‌ని సీఈవో చేసినట్లు తెలియగానే కాంచన ఆలోచిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు కలవడానికి మనం ఏదైనా చేయాలని కార్తీక్, శివన్నారాయణ అనుకున్నారు.
శ్రీధర్‌ను సీఈవో చేయాలా వద్దా అని తాత అడిగితే ఏమి చెప్పేదానివి అని కార్తీక్ అడగ్గా, దీపను సీఈవోగా ఉండను అని ఎందుకన్నావని కాంచన ప్రశ్నించింది. తన భర్తకు మించిన గౌరవం తనకు అక్కర్లేదని దీప చెప్పింది. దీని ప్రకారం, శ్రీధర్ సీఈవో అవ్వడం శివన్నారాయణ వ్యూహాత్మక నిర్ణయమేనని కార్తీక్ నిర్ధారించుకున్నాడు.
తరువాత ఏం జరగనుంది? శ్రీధర్ విషయంలో కాంచన నిర్ణయం ఏమిటి? జ్యోత్స్న కంపెనీలో ఉంటుందా? లేదా? తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ చూడాల్సిందే.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications