Karthika deepam 2 October 15th Episode:దీపకు శుభవార్త..సుమిత్ర అదృశ్యం..!!
దశరథ మాట్లాడిన కఠిన మాటలకు మనసు విరిగిన సుమిత్ర అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఇదంతా చూసినా సీఈఓ పదవి కోసం జ్యోత్స్న మౌనంగా ఉండిపోయింది. సుమిత్రపై ఏర్పడిన సానుభూతి తన పోస్ట్‌ను కాపాడుతుందని ఆమె పారుతో అంటుంది. కార్తీక్, దీపకు ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్పి బాధపడతాడు.
నేటి 489వ ఎపిసోడ్ హైలైట్స్:దీపకు శుభవార్త,కార్తీక్‌కు సిగ్గు!
ఉదయాన్నే అనసూయ, దీపతో మాట్లాడుతూ "త్వరలో నువ్వు గర్భవతి కావాలి. కార్తీక్ బాబుకి ఆడపిల్లలంటే ఇష్టం కదా, అందుకే శౌర్యకు ఒక చెల్లెలో, తమ్ముడో కావాలి" అని కోరుకుంటూ బొమ్మను ఇస్తుంది. దీప ఆశీర్వాదంగా ఆ బొమ్మను తీసుకుంటూ, "మేమిద్దరం భార్యాభర్తలం కూడా" అని చెప్పడంతో కార్తీక్ సిగ్గుపడతాడు. తన కోరిక నెరవేర్చాలని దీప అడగడంతో, "నాకు సిగ్గేస్తుంది" అని కార్తీక్ సరదాగా అంటాడు.

సమస్య తీరిన అల్లుడు.. బిజినెస్‌పై నిరాసక్తత!
శ్రీధర్ ఇచ్చిన 24 గంటల డెడ్‌లైన్‌కు ముందే కాశీ, ఇంటర్వ్యూకి వెళ్లి అపాయింట్‌మెంట్ లెటర్ తెచ్చి అత్తమామలను ఆశ్చర్యపరుస్తాడు. అయితే, "నాకు ఇష్టం లేని పని బలవంతంగా చేస్తే నష్టాలే వస్తాయి. నా బాధలో మీరు లేరు, నా ఆనందం గుర్తొచ్చింది" అంటూ కాశీ కోపంగా మాట్లాడతాడు. శ్రీధర్, కావేరి, స్వప్నలు పశ్చాత్తాపపడి అతడిని బుజ్జగిస్తారు.
సుమిత్ర ఇంటిని వీడి అదృశ్యం!
సుమిత్రను కలపడానికి దీప, కార్తీక్‌లు శివన్నారాయణ ఇంటికి రాగా, పారిజాతం వచ్చి వారిపై అరుస్తుంది. సుమిత్ర ఇల్లు వదిలి వెళ్లిపోయిందని, అంతా వారి వల్లే జరిగిందని నిందిస్తుంది. జ్యోత్స్న, పారుల మాటలకు శివన్నారాయణ, దశరథ్ సీరియస్ అవుతారు.
పోలీస్ కంప్లయింట్ ఇద్దామని జ్యోత్స్న అనడంతో, పరువు పోతుందని దశరథ్ మండిపడతాడు. "అంత గొడవ జరిగినప్పుడు మీరు అత్తయ్య పక్కన ఉండాలి కదా?" అని దీప నిలదీస్తుంది. సుమిత్ర వెళ్లిపోవడం రాత్రి చూసినా జ్యోత్స్న ఎందుకు చెప్పలేదు? అని కార్తీక్ నిలదీయగా, "చీకట్లో సరిగా కనిపించలేదు" అని అబద్ధం చెబుతుంది.
కన్నతల్లి నీడనైనా బిడ్డ పోల్చుకోగలదు అని దీప సీరియస్ అవుతుంది. జ్యోత్స్న నిర్లక్ష్యం చూసి కోపం తట్టుకోలేక శివన్నారాయణ, పారును కొట్టబోగా దశరథ అడ్డుపడతాడు. చివరికి, సుమిత్రను వెతికి తీసుకురావాలని కార్తీక్, దీపలకు శివన్నారాయణ అప్పగిస్తాడు.
మరోవైపు, శ్రీధర్‌కు ఫోన్ చేసి, సుమిత్ర అక్కడికి వచ్చిందేమోనని కార్తీక్ ఆరా తీయడంతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగుస్తుంది. సుమిత్ర ఎక్కడికి వెళ్లింది? ఆమెను కార్తీక్-దీప ఎలా కనిపెడతారు? వేచి చూడాలి.












Click it and Unblock the Notifications