Karthika deepam 2 October 17th Episode:సుమిత్ర ఇంటికి చేరిక - దీప షాకింగ్ నిజం!

భర్త దశరథ మాటలకు మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిపోయిన సుమిత్ర కోసం కార్తీక్, దీప, దశరథ్, శ్రీధర్‌లు ఊరంతా వెతుకుతారు. భార్య జాడ దొరక్కపోవడంతో దశరథ్ కంటతడి పెడతాడు. ఈ టెన్షన్‌లో శివన్నారాయణకు బీపీ పెరిగి కుప్పకూలిపోతారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, సుమిత్రను వెతికి తీసుకురావాలని శివన్నారాయణ కార్తీక్‌కు అప్పగిస్తారు.

నేటి 491వ ఎపిసోడ్ హైలైట్స్:దొంగల నుంచి తాళి రక్షించిన దీప!

ఒక చోట బాధపడుతున్న సుమిత్రను కొందరు దొంగలు చుట్టుముట్టి నగలు ఇవ్వాలని కత్తితో బెదిరిస్తారు. 'కుటుంబాన్ని వదులుకున్న నాకు వీటిపై మమకారం లేదు' అంటూ సుమిత్ర నగలు ఇచ్చేస్తుంది. అయితే, దొంగలు తాళిబొట్టు కూడా లాక్కోబోతుండగా, దీప ధైర్యంగా వచ్చి వారిని కర్రతో తరిమికొడుతుంది.

Karthika deepam 2 Serial October 17th Episode 491 Here is the Today s full story

శివన్నారాయణకు కాంచన ప్రేమ!

సుమిత్ర కనిపించలేదన్న నిజం చెప్పమని శివన్నారాయణ అడగగా, కాంచన అతనికి అన్నం తినిపించడానికి ప్రయత్నిస్తుంది. "చిన్నప్పుడు నువ్వు నాకు తినిపించావు, ఇప్పుడు నువ్వు మాకు చంటి పిల్లాడివి" అంటూ అన్నం తినిపిస్తుంది. దశరథ్‌కు కూడా కాంచన తినిపించడంతో, ఆ ప్రేమను చూసి దశరథ్ కాంచనకు తినిపిస్తాడు.

జ్యోత్స్నపై పారిజాతం ఫైర్!

శివన్నారాయణ, దశరథ్‌ల బాధను చూసిన పారిజాతం పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. "నువ్వు మనిషివి కాదు, మరబొమ్మవి" అంటూ జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది. జ్యోత్స్న నిర్దయ కారణంగానే ఇదంతా జరిగిందని, సుమిత్ర ఇంటికి వస్తేనే తన భర్త (శివన్నారాయణ) సంతోషంగా ఉంటాడని పారు బాధపడుతుంది.

'నువ్వు నా అమ్మవు' అని షాక్ ఇచ్చిన దీప!

సుమిత్ర ఇంటికి రావాలని దీప ఎంత బతిమాలినా ఆమె ఒప్పుకోదు. "నా దారిన నన్ను పోనివ్వు, లేదంటే నా శవాన్ని చూస్తావు" అని సుమిత్ర అనడంతో దీప షాక్ అవుతుంది. "నేను మీకోసం ఎందుకు వెతుకుతున్నాను? నాకూ మీకూ ఏ బంధం ఉంది?" అని సుమిత్ర అడగ్గా... "నువ్వు నా అమ్మవు" అని దీప ఆ షాకింగ్ నిజాన్ని బయటపెడుతుంది.

ఆ వెంటనే, మళ్లీ వచ్చిన దొంగ, దీపను కొట్టబోగా సుమిత్ర అడ్డుగా వెళ్లి దెబ్బ తగిలించుకుని కుప్పకూలిపోతుంది. ఆందోళనలో ఉన్న దీప.. అర్జెంట్‌గా ఇంటికి రమ్మని కార్తీక్‌కు ఫోన్ చేస్తుంది.

సుమిత్ర ఇంటికి చేరిక, కార్తీక్ ఆగ్రహం!

తాతయ్య కళ్లు తిరిగి పడిపోయినా దీప ఇంటి వద్దే ఉండడంపై కార్తీక్ కోపంతో రంకెలు వేస్తాడు. ఇంతలో శౌర్య వచ్చి అమ్మమ్మ ఇంటిలోనే ఉంది అని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. మంచంపై తలకి కట్టుతో సుమిత్రను చూసి అందరూ ఆశ్చర్యపోవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. సుమిత్ర ఇంటికి ఎలా వచ్చింది? దీప చెప్పిన నిజం సుమిత్ర నమ్ముతుందా? తదుపరి ఎపిసోడ్‌లో చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+