Karthika deepam 2 October 1st Episode:రూ.10 కోట్లు చెక్..నేటి ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..!!
Karthika Deepam 2:కార్తీకదీపం గత ఎపిసోడ్‌లో, దీప కళ్లు తిరిగి పడిపోవడంతో సుమిత్ర మానవత్వంతో భోజనం పెట్టింది, కానీ మాటలతో మాత్రం ఆమెను తీవ్రంగా బాధించింది. దీపకు ఎక్కిళ్లు రాగా, సుమిత్ర నీళ్లు తాగిస్తుంది. వారిద్దరినీ చూసి కార్తీక్, జ్యోత్స్న షాక్ అవుతారు. సుమిత్ర-దీపలు దగ్గర కాకుండా ఉండేందుకు జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. మరోవైపు, శ్రీధర్ కాంచన ఇంటికి డబ్బులు, సరుకులు తీసుకెళ్లగా, కాంచన వాటిని తిరస్కరించి, చివరికి డబ్బులు మాత్రం చేబదులుగా తీసుకుంటుంది.
తాజా ఎపిసోడ్ (అక్టోబర్ 1)లో..
తండ్రి తెచ్చిన సరుకులు చూసిన కార్తీక్ మండిపడి, వాటిని తిరిగి తీసుకెళ్లమని శ్రీధర్‌తో గొడవ పడతాడు. "పెళ్లిళ్లు, పూజలకే నాన్న కావాలా? ఇంటికి సరుకులు తీసుకురావడానికి అక్కర్లేదా?" అని శ్రీధర్ ప్రశ్నించగా, కార్తీక్ "నా పక్కన నిలబడితే బాధ్యత, నా కంచంలో భోజనం పెడితే అవసరం. నా అవసరం తీర్చడం నా బాధ్యత" అని ఘాటుగా బదులిస్తాడు. సరుకులను ఇంట్లోనే ఉంచాలని శ్రీధర్ వార్నింగ్ ఇవ్వడంతో కార్తీక్ శాంతిస్తాడు. దీప కళ్లు తిరిగి పడిపోయిన విషయం తెలుసుకున్న కాంచన షాక్ అవుతుంది.

దశరథ్ భోజనం చేయకపోవడంతో సుమిత్ర కూడా తినదు. తన తల్లిని తినమని దశరథ్‌ను జ్యోత్స్న అడగ్గా, దశరథ్ కోప్పడతాడు. "తప్పు చేసిన మనిషికి దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆ అవకాశం దొరికినప్పుడు మరో తప్పు చేస్తే కోపం ఎలా పోతుంది?" అని దశరథ్ జ్యోత్స్నను ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న, పారుల గొడవలో జ్యోత్స్న పిల్లలను మార్చిన విషయాన్ని అంగీకరించి, పారును బ్లాక్‌మెయిల్ చేస్తుంది.
నిద్రపట్టని శ్రీధర్, కొడుకు డ్రైవర్‌గా పనిచేయడంపై ఆవేదన చెంది, ఉదయాన్నే శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు. జ్యోత్స్నతో మాట్లాడి, కార్తీక్‌ను అగ్రిమెంట్ నుంచి విడిపించడానికి తాను చేయాల్సిందేంటో అడుగుతాడు. పారిజాతం అడ్డుపడినా శివన్నారాయణ వారించి జ్యోత్స్న, శ్రీధర్‌లు తేల్చుకోమంటాడు. అగ్రిమెంట్ రద్దు కావాలంటే 10 కోట్ల జరిమానా కట్టాలని జ్యోత్స్న చెప్పగా, శ్రీధర్ వెంటనే రూ.10 కోట్ల చెక్ రాసి ఆమెకు ఇస్తాడు. "నా కొడుకు కోసం నా ఆస్తి మొత్తం రాసిస్తా" అని చెబుతాడు.
అయితే, "అగ్రిమెంట్ రద్దు విషయంలో బావ అభ్యంతరం లేకపోతే, నాకు కూడా అభ్యంతరం లేదు" అని జ్యోత్స్న మెలిక పెడుతుంది. ఇంతలో కార్తీక్, దీపలు అక్కడికి రావడంతో దశరథ్ "నీ కొడుకును అగ్రిమెంట్ నుంచి రిలీవ్ చేయడానికి మీ నాన్న జ్యోత్స్నకి 10 కోట్ల చెక్ ఇచ్చాడు" అని చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. "నా నిర్ణయమే నీ నిర్ణయం ఫైనల్ అని చెప్పు" అని శ్రీధర్ కొడుకుపై ఒత్తిడి తెస్తాడు. ఈ ఉత్కంఠభరితమైన నిర్ణయంపై తర్వాతి ఎపిసోడ్ ఆసక్తిగా మారింది.
-
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ?












Click it and Unblock the Notifications