Karthika deepam 2 October 22nd Episode:సుమిత్ర జాడ తెలిసినట్లేనా-శివన్నారాయణకు మళ్లీ ఛాతీ నొప్పి

సుమిత్ర ఇంటిలో లేదన్న అనుమానంతో జ్యోత్స్న కార్తీక్ ఇంటికి వచ్చి, శౌర్యను విచారించినా దీప తెలివిగా ఫోటో చూపించి తప్పించుకుంది. సుమిత్ర ఇంట్లోనే ఉందన్న నిజం తెలియక జ్యోత్స్న వెళ్లిపోగా, సుమిత్ర మళ్లీ కింద పడిపోవడంతో దీప, కాంచనలు కంగారుపడ్డారు. మరోవైపు, భార్యను వెతుకుతానని దశరథ్ శపథం చేస్తాడు.

నేటి 495వ ఎపిసోడ్ హైలైట్స్:
గాయపడ్డ మనసుకు టైం కావాలి:కార్తీక్

సుమిత్ర ఎక్కడుందో తెలియదని నటిస్తున్న కార్తీక్, శివన్నారాయణకు ధైర్యం చెబుతాడు. "అత్తయ్య గాయపడ్డ మనసును నయం చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటోంది. మనం ఎంత వెతికినా ఆమె దొరకదు, ఒకవేళ దొరికినా రానంటుంది. అత్తయ్య ఏ క్షణమైనా ఇంటికి రావొచ్చు" అని అందరూ ఇంట్లోనే ఉండమని కోరతాడు. అయితే, కార్తీక్ మాటలు అబద్ధమని, సుమిత్ర ఎక్కడ ఉందో తనకి తెలుసని జ్యోత్స్న అనుమానిస్తుంది.

Karthika deepam 2 Serial October 22nd Episode 495 Here is the Today s full story

కాశీ నిర్ణయంతో శ్రీధర్ షాక్!

సుమిత్ర గొడవ జరుగుతుండగా, మరోవైపు శ్రీధర్ అల్లుడు కాశీ, తాను కొత్త ఇల్లు చూసుకుని వెళ్ళిపోతున్నట్లు చెప్పి షాక్ ఇస్తాడు. "ఇల్లరికం అల్లుడికి, మామూలు అల్లుడికి తేడా ఉంటుంది కదా" అంటూ కాశీ వెళ్లిపోతానని అంటాడు. దీంతో శ్రీధర్ కంగారుపడి, కాశీకి దగ్గర్లోనే ఇల్లు చూస్తానని ఒప్పిస్తాడు.

జ్యోత్స్న అనుమానం: శివన్నారాయణకు పెయిన్!

సుమిత్ర ఇంటిని వీడటానికి కారణం జ్యోత్స్ననే అని దశరథ్ తీవ్రంగా కోప్పడతాడు. మనుషుల్ని రెచ్చగొట్టి ఇంట్లో గొడవలకు కారణం అయ్యావని శివన్నారాయణ కూడా కోడలిపై మండిపడతారు. "నిన్న ఉన్న టెన్షన్ కార్తీక్‌లో ఈరోజు లేదు. దీప కూడా ఇంటికి రావడం లేదు, వాళ్లు అసలు మమ్మీని వెతకడం లేదు" అని జ్యోత్స్న తన అనుమానం వ్యక్తం చేస్తుంది. జ్యోత్స్న మాటలతో శివన్నారాయణకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వస్తుంది. "సుమిత్ర ఎక్కడుందో కార్తీక్‌కు తెలుసా?" అని శివన్నారాయణ అనుమానిస్తాడు.

శౌర్య దాగుడుమూతల ఆట!

సుమిత్రకు దాగుడుమూతల ఆట గురించి చెప్పిన శౌర్య, అమ్మమ్మను ఎవరు చూసినా దొరికిపోయినట్లేనని చెప్తుంది. "నా గురించి ఎవరికీ చెప్పనని" సుమిత్రకు మాట ఇస్తుంది. ఇంతలో కార్తీక్ వచ్చి శౌర్యను బయటికి తీసుకెళ్లడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. సుమిత్ర రహస్యం జ్యోత్స్నకు ఎప్పుడు తెలుస్తుంది? అనేది ఉత్కంఠగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+