Karthika deepam 2 October 30th:దశరథ్-సుమిత్ర భావోద్వేగ కలయిక..జ్యోత్స్న ప్లాన్ రివర్స్..!!

సుమిత్రను గుడిలో చూసిన కార్తీక్, ఆ విషయాన్ని దశరథ్‌కు చెప్పకపోవడం. దీపను కిడ్నాప్ కేసులో ఇరికించడానికి జ్యోత్స్న పోలీసులతో స్టేషన్‌కు రావడం. కాశీ, ఉద్యోగం గురించి స్వప్నతో అబద్ధాలు చెప్పడం. సుమిత్రను దూరం పెట్టి తప్పు చేశానని దశరథ్ కార్తీక్‌తో బాధపడటం.

నేటి 502వ ఎపిసోడ్ హైలైట్స్ (అక్టోబర్ 30)
గుడిలో సుమిత్ర భావోద్వేగం, దశరథ్ పశ్చాత్తాపం: గుడిలో సుమిత్రను చూసిన కార్తీక్, తాను వచ్చిన విషయం దశరథ్‌కు చెప్పొద్దని ఆమె సైగలు చేయడంతో మౌనంగా ఉంటాడు. "నేను పెద్ద తప్పు చేశాను" అని దశరథ్ బాధపడుతుండగా, "అత్తయ్య మీకోసం వస్తుంది" అని చెప్పి కార్తీక్ అక్కడినుంచి వెళ్తాడు.

karthika-deepam-2-serial-october-30th-episode-502-here-is-the-todays-full-story

దశరథ్‌కు ఎదురుపడలేని సుమిత్ర: తాను ఇంట్లోంచి వచ్చాక ఏం చేస్తున్నానో తనకే అర్థం కావడం లేదని సుమిత్ర కార్తీక్‌తో చెబుతుంది. తన తప్పు తెలిసిపోవడంతో భర్తకు ఎదురుపడలేక, ఆయన ముందు తలదించుకుని నిలబడటం తనకు ఇష్టం లేదని చెప్పి గుడిలోంచి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో దశరథ్ ఆమెను పిలుస్తాడు. "నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు, నన్ను క్షమించు" అని కోరడంతో సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది.

మామను కలపడంలో కార్తీక్ సక్సెస్: జరిగిన దానికి ఇద్దరి తప్పూ ఉందని దశరథ్ ఒప్పుకుంటాడు. తనకంటే ముందే సుమిత్ర అర్చన చేయించిందని అనుకున్నానని చెబుతాడు. భర్త మాటలు విన్నాకే, ఆయన ముందు పడలేక దాక్కున్నానని సుమిత్ర అంటుంది. "ఇంకా మనం చాలా దూరం ప్రయాణించాలి, కూతురి పెళ్లి చేయాలి" అని దశరథ్ అనడంతో వారిద్దరూ కలిసిపోతారు. "మీరిద్దరూ ఇలా మనసు విప్పి మాట్లాడుంటే ఎప్పుడో కలిసిపోయేవారు" అని కార్తీక్ సంతోషిస్తాడు.

పారిజాతంపై శివన్నారాయణ సెటైర్లు: దశరథ్ ఎక్కడికి వెళ్లాడో చెప్పమని పారిజాతం శివన్నారాయణను అడగ్గా, ఆయన తెలియనట్లు నటిస్తాడు. "పక్కవాడి సంసారంలో దూరకూడదని, పుల్లలు పెట్టి చెడగొట్టకుండా ఉండటం తెలుసు" అంటూ పారుపై సెటైర్లు వేస్తాడు. పారు, జ్యోత్స్న ఆఫీసు గురించి గొప్పగా చెబితే, "ఆ మాట నిజమైతే కంపెనీ ఎప్పుడో లాభాల్లో నడిచేది" అని పెద్దాయన వ్యంగ్యంగా నవ్వుతాడు.

పోలీస్ స్టేషన్‌లో జ్యోత్స్న హంగామా.. ఎంట్రీ ఇచ్చిన శివన్నారాయణ: పోలీస్ స్టేషన్‌లో ఉన్న దీప, కాంచనలను జ్యోత్స్న బెదిరిస్తుంది. సుమిత్ర ఎక్కడుందో చెప్పకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయిస్తానని, సెల్‌లో వేసి కొట్టిస్తానని హెచ్చరిస్తుంది. దీపకు కార్తీక్ ఫోన్ చేయగా లాక్కుని మాట్లాడిన జ్యోత్స్న, "నీ భార్య ఇక్కడే ఉంది, మా మమ్మీని తీసుకొచ్చి నీ భార్యను తీసుకెళ్లు" అని సవాల్ చేస్తుంది. పది నిమిషాల్లో దీప ఇంటికి చేరాలని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. "శివన్నారాయణ గారి మనవరాలివే అయితే, సుమిత్ర కూతురివే అయితే పావుగంట అక్కడే ఉండటానికి ట్రై చేయ్" అని కార్తీక్ జ్యోత్స్న పొగరును అణిచివేస్తాడు.

ట్విస్ట్: జ్యోత్స్నను నిలదీసిన తాతయ్య: గడువు సమయం అయిపోవడంతో దీపపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని జ్యోత్స్న పోలీసులకు చెబుతుండగా, అకస్మాత్తుగా పారిజాతం మరియు శివన్నారాయణ స్టేషన్‌లోకి ప్రవేశిస్తారు. "సుమిత్ర అన్న మాట వింటే దీప మీద కేసు పెట్టేస్తావా?" అని శివన్నారాయణ మండిపడతాడు. పోలీసులపై ఫైర్ అవుతూ, తన కోడలిని రక్షించుకోవడానికి వచ్చిన కాంచనను మెచ్చుకుంటారు.

తరువాత ఏం జరుగుతుంది? దశరథ్-సుమిత్రల కలయిక గురించి తెలిస్తే జ్యోత్స్న, పారిజాతం ఎలా స్పందిస్తారు? దీప, కాంచనలను శివన్నారాయణ ఎలా సేఫ్‌గా ఇంటికి తీసుకెళ్తారు? తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+