Karthika deepam 2 September 15 Episode:టెన్షన్‌లో కార్తీక్,దీప..శౌర్య బర్త్‌డే సీక్రెట్ లీక్!!
తెలుగునాట సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న సీరియల్ కార్తీకదీపం. గత ఎపిసోడ్‌లో జ్యోత్స్నకు సుమిత్ర గట్టి వార్నింగ్ ఇవ్వడం చూశాం. దీప విషయంలో జోక్యం చేసుకోకుండా తన వ్యాపారంపై దృష్టి పెట్టాలని సుమిత్ర మందలించింది. మరోవైపు, మారిన శ్రీధర్‌ను చూసి దిల్, కావేరి సంతోషించారు. తన తండ్రి మారడానికి అన్నయ్య కార్తీక్ బాబే కారణమని స్వప్న గ్రహిస్తుంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 15న ప్రసారమైన 463వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 15)లో..
శౌర్య పుట్టినరోజు కావడంతో కార్తీక్, దీప ఆమెను వెంటబెట్టుకుని శివనారాయణ ఇంటికి డ్యూటీకి వస్తారు. శౌర్య స్కూల్‌కు వెళ్లకుండా రావడాన్ని చూసి శివ నారాయణ ఆశ్చర్యపోతాడు. శౌర్య బోర్ ఫీల్ అవుతుందనుకొని ఆమెకు డ్రాయింగ్ బుక్ తెచ్చి ఇస్తాడు. అయితే, పారుజాతం చేతితో ఆ బుక్ ఇవ్వడం వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తాడు. గతంలో శౌర్య చాక్లెట్లు దొంగిలించినందుకు, పారుజాతం ఆమె చేతనే మంచి పని చేయించాలని చూస్తాడు.

మరోవైపు, దీప టెన్షన్ పడుతూ త్వరగా వంట పూర్తి చేయాలని చూస్తుంది. శౌర్య పుట్టినరోజు విషయం ఇంట్లో వారికి తెలియకూడదని దీప, కార్తీక్‌లు అనుకుంటారు. అయితే, శౌర్య తన డ్రాయింగ్ బుక్‌లో బర్త్‌డే కేక్ బొమ్మ గీయగా, అది చూసిన శివ నారాయణకు అనుమానం వస్తుంది. శౌర్య బొమ్మలు చూపించడానికి ఇష్టపడకపోవడంతో ఆయన బలవంతంగా చూస్తాడు. కుటుంబం అంతా కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నట్టు ఆ బొమ్మలో గీసి ఉండటం చూసి శివ నారాయణ ఎమోషనల్ అవుతాడు.
అప్పటికైనా విషయం అర్థం కాకపోవడంతో, శివ నారాయణ పారుజాతానికి ఫోన్ చేసి శౌర్య స్కూల్‌కి ఎందుకు రాలేదో కాంచనను అడిగి తెలుసుకోమని చెబుతాడు. పారుజాతం కాంచనకు ఫోన్ చేయగా, "ఈరోజు శౌర్య పుట్టినరోజు" అని కాంచన చెబుతుంది. ఆ విషయం తెలిసిన శివ నారాయణ, కార్తీక్, దీప తమకు ఎందుకు ఈ విషయం దాచారో అని సందేహిస్తాడు. దీనితో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications