Karthika deepam 2 September 23 Episode: ఊహించని ట్విస్ట్...షాక్‌లో మొత్తం కుటుంబం..!!
Karthika deepam 2 September 23 Episode:కార్తీకదీపం 2 సీరియల్ తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. కార్తీక్ బాబు దీప, జ్యోత్స్నల కాంబో తెలుగు ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌ను ఒకసారి రివైండ్ చేసుకుంటూ ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. గత ఎపిసోడ్‌లో, సుమిత్ర కార్తీక్, దీప, కాంచనలను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. రెండు కుటుంబాలు కలవడానికి తాను దీపకు క్షమాపణలు చెబుతానని అంటుంది. అయితే, తన తాళిని ఎక్కడైతే తెంచిందో అక్కడే క్షమాపణలు చెబుతానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. శ్రీధర్ కూడా తన కుటుంబం తరపున వారితో పాటు సుమిత్ర ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 22న ప్రసారమైన 470వ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది.
తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 22)లో..
కార్తీక్, దీపలతో పాటు కాంచన, శ్రీధర్ అందరూ కలిసి శివ నారాయణ ఇంటికి వెళ్తారు. వారి రాకతో సుమిత్ర చాలా సంతోషిస్తుంది. దీపను కూడా ఆప్యాయంగా పలకరించి, వంటలో సహాయం చేయమని అడుగుతుంది. సుమిత్ర ప్రవర్తన చూసి దీప సంతోషించినప్పటికీ, లోపల భయంగా ఉంటుంది. జ్యోత్స్న, పారిజాతాలు కూడా సుమిత్ర ప్రవర్తనపై సందేహం వ్యక్తం చేస్తారు.

అందరూ భోజనం చేస్తున్నప్పుడు, పారిజాతం దీపను అవమానించేలా మాట్లాడగా, కార్తీక్ ఆమెకు గట్టిగా బుద్ధి చెబుతాడు. ఆ తర్వాత సుమిత్ర జ్యోత్స్నతో మాట్లాడటానికి బయటికి వెళ్తుంది. దీపను క్షమించబోతున్నానని సుమిత్ర చెప్పగా, జ్యోత్స్న ఆశ్చర్యపోతుంది.
ఇంట్లోకి తిరిగి వచ్చిన సుమిత్ర, దీపను పిలిచి క్షమాపణలు చెబుతుంది. "నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు కూడా నీ తప్పును ఒప్పుకోవాలి" అని షరతు పెడుతుంది. "నన్ను చంపడానికి నువ్వు బుల్లెట్ కాల్చావు కదా, దశరథ ఛాతీలో దిగిన ఆ బుల్లెట్ నువ్వే కదా కాల్చావు" అని నిలదీస్తుంది. సుమిత్ర మాటలకు దీప ఏమాత్రం ఆలోచించకుండా, "అవును" అని సమాధానం ఇస్తుంది. దీప ఇచ్చిన షాకింగ్ సమాధానం విని అక్కడున్న వారందరూ దిగ్భ్రాంతికి గురవుతారు. తర్వాతి ఎపిసోడ్‌పై ఉత్కంఠ పెరిగింది.












Click it and Unblock the Notifications