Karthika deepam 2 September 5th Episode:సంబంధాలను తెంచే కుట్ర:జ్యోత్స్న పన్నాగం..!
"కార్తీక దీపం 2" సీరియల్‌లోని సెప్టెంబర్ 4వ తేదీ ఎపిసోడ్, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలు మరియు ఉద్రిక్తతలతో నిండిపోయింది. కార్తీక్, దీపాల వివాహంలో తాళిబొట్టు తీసినందుకు సుమిత్రను శివ నారాయణ, దశరథ నిలదీశారు. తన కూతురు జ్యోత్స్నకు మద్దతుగా, సుమిత్ర తాను చేసింది తప్పేం కాదని వాదించింది. దాంతో దశరథ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
సెప్టెంబర్ 5,455వ ఎపిసోడ్
దశరథ సుమిత్రను క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేస్తున్న సమయంలోనే దీపా కాఫీతో అక్కడికి వస్తుంది. "నీ వల్లే మా ఇంట్లో గొడవలు" అని జ్యోత్స్న కోపంతో దీపా చేయి పట్టుకుని బయటకు నెట్టేసింది. "నీ వల్లే మా ఇంటికి దరిద్రం చుట్టుకుంది, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు" అని మండిపడింది. పక్కనే ఉన్న సుమిత్ర కూడా "దీపాతోనే అన్ని దరిద్రాలు" అని మాట్లాడింది.

జ్యోత్స్న మరోసారి దీపాను తోసేయబోగా, అప్పుడే ఇంటికి వచ్చిన కార్తీక్ బాబు ఆమెను పట్టుకున్నాడు. సుమిత్ర, పారుజాతం, జ్యోత్స్నలు కలిసి దీపాను వెళ్లగొట్టడాన్ని చూసిన శివ నారాయణ షాక్ అయ్యాడు. "మీరు మరీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోలేదు. ఈ ఇంట్లో అసలేం జరుగుతుంది?" అని మండిపడ్డాడు. కార్తీక్ బాబు "దీపాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలంటే మీరు నాకు పెట్టిన అగ్రిమెంట్‌ను రద్దు చేయాలి" అని తేల్చి చెప్పాడు.
"మీరు చేసిన పాపం మీకే చుట్టుకుంటుంది. దీపా ఇంట్లోనే ఉంటుంది. ఈసారి ఇలాంటి తప్పు మళ్లీ జరిగితే, మీరు ఇంట్లో నుంచి గెంటేయడం కాదు, నేనే ఇంట్లోంచి వెళ్లిపోతాను" అని శివ నారాయణ కోపంగా హెచ్చరించాడు. శివ నారాయణ మాటలకు దశరథ మరింత బాధపడ్డాడు.
సంబంధాలను తెంచే కుట్ర: జ్యోత్స్న పన్నాగం..
సుమిత్ర క్షమాపణ చెప్పకపోవడంతో, దశరథ స్వయంగా కార్తీక్, దీపాలను క్షమించమని అడిగాడు. "ఎవరో చేసిన తప్పులకు మీరు క్షమాపణలు చెప్పడం ఎందుకు మామయ్య?" అని కార్తీక్ బాబు అడిగాడు. దశరథ క్షమించమని అడగటం చూసిన జ్యోత్స్న, సుమిత్ర మనసులో దశరథపై మరింత ద్వేషం పెంచాలని కుట్ర పన్నింది.
"నాన్నెందుకు క్షమాపణ చెప్పాడు? అంటే నువ్వు తప్పు చేశావని ఆయన దీపా ముందు ఒప్పుకుంటున్నాడు కదా అమ్మా?" అని జ్యోత్స్న సుమిత్రతో అంది. "నీ కూతురు జీవితం కోసమే నువ్వు తాళిబొట్టు తీశావు. కానీ నాన్నకు తన కూతురి మీద ప్రేమ లేదా?" అని ప్రశ్నించింది. జ్యోత్స్న మాటలకు సుమిత్రకు దశరథపై కోపం పెరిగింది. దశరథ, సుమిత్రలను విడగొట్టడానికి ఇదే సరైన సమయం అని జ్యోత్స్న భావించింది. "అమ్మ నా వైపు ఉంటే ఇంట్లో ఒక్కొక్కరిని ఎలా పడితే అలా ఆడుకుంటాను" అని మనసులో అనుకుంది. తర్వాత ఏం జరిగిందనేది తర్వాతి ఎపిసోడ్‌లో చూడాలి.












Click it and Unblock the Notifications