Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karthika Deepam 2 : సెప్టెంబర్ 06 ఎపిసోడ్.. జ్యోత్స్నతో కార్తీక్ ఛాలెంజ్.. !

తెలుగులో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందుతున్న సీరియల్ కార్తీక దీపం. ఇప్పుడు ఈ సీరియల్ పార్ట్ 2 పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక దీపం 2 సీరియల్ కూడా ఆడియన్స్ ని అలరిస్తూ రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 6న ప్రసారం కాబోయే 456 ఎపిసోడ్ లో.. కార్తీక్ మైండ్ గేమ్, ఛాలెంజ్ చేయడం.. ఎమోషనల్ సీన్స్ కలిపి మరింత ఇంటరెస్టింగ్ గా మారింది. ఏం జరిగిందో తెలుసుకుందాం..

కార్తీక్, దీప సీన్ తో ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. కార్తీక్ దీప చేతిలో కత్తిని చూడగానే జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. కార్తీక్ ఆపి "ఏం జరిగి ఉంటుందో నేను ఊహించగలను" అన్నాడు. దీప విసుగుగా "ఏం జరిగిందో చెప్పు" అని అడగగా, కార్తీక్ "నీకు, జ్యోత్స్నకు గొడవ అయ్యింది. జ్యోత్స్నకు అత్త సపోర్ట్ చేసింది, నీకు మావయ్య సపోర్ట్ చేసి ఉంటారు" అని తేలికగా చెప్పాడు. దాంతో దీప "నువ్వు వెళ్లి మొక్కలకు నీళ్లు పోసుకో" అని అసహనంగా అంది.

karthika-deepam-2-telugu-serial-september-6-episode-details

కార్తీక్ అడగడంతో, తన తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవ గురించి దీప వివరించింది. జ్యోత్స్న కావాలనే తండ్రిని రెచ్చగొట్టిందని.. దానివల్ల తండ్రి తల్లిని చాలా మాటలు అన్నాడని దీప ఆవేదన వ్యక్తం చేసింది. "నీ కారణంగానే మా భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందని అమ్మ నన్నే తిట్టింది" అని దీప బాధగా చెప్పింది. ఇది కార్తీక్‌ను షాక్‌కు గురి చేసింది. అత్త తన తల్లిదండ్రుల మధ్య గొడవ సృష్టించిందని కార్తీక్ భావిస్తాడు. ఈలోగా జ్యోత్స్న అక్కడికి రావడంతో, కార్తీక్‌కు సైగ చేసింది దీప. జ్యోత్స్న "ఏంటి బావా, ఎవరినో కలుపుతాను అంటున్నావు, ఎవరిని?" అని నవ్వుతూ అడిగింది. కార్తీక్ చమత్కారంగా "చపాతి పిండి కలపాలి అంటే నేను కలుపుతాను అంటున్నాను అంతే" అని చెప్పాడు. జ్యోత్స్న "నేను నీతో మాట్లాడాలి బావా" అని పట్టుబట్టింది. కార్తీక్ "దీపా నువ్వు వెళ్లు, నేను మేడమ్ గారితో మాట్లాడతాను" అన్నాడు.

దీప వెళ్ళబోతుండగా జ్యోత్స్న "ఆగు" అని ఆపింది. "నీకు పెళ్లి చేసి పంపించడంతోనే ఇంటి మనుషుల్ని వరుస పెట్టి పిలిచే అధికారం పోయింది. ఇంక నువ్వు అమ్మా నాన్న అని పిలవకు. అలా పిలవాలంటే దానికి అర్హత, అధికారం ఉండాలి. రెండూ నీకు లేవు" అని జ్యోత్స్న అంది. దానికి దీప "నీకు ఉన్నాయా? అర్హత అధికారం అంటే మనుషుల్ని మాటలతో రెచ్చగొట్టడం కాదు, మాటలతో కలపడం. వీలైతే అది చేయండి అమ్మాయిగారు, తప్పుకోండి" అని జ్యోత్స్నను అక్కడి నుంచి వెళ్లిపోయింది. "ఏంటి బావా, దీప ఏంటి కొత్తగా కనిపిస్తోంది" అని జ్యోత్స్న కార్తీక్‌ను అడిగింది.

కార్తీక్, జ్యోత్స్న కారులో బయటికి వెళ్తారు. "ముందు నువ్వు ఎందుకొచ్చావో చెప్పండి మేడమ్ గారు" అని కార్తీక్ అడిగాడు. జ్యోత్స్న "ఇక్కడ కాదు, నాతో రా" అంటూ వెళ్లిపోయింది. "మేడమ్ గారికి ఏదో డౌట్ వచ్చినట్లుంది" అని కార్తీక్ అనుకున్నాడు. ఒక చోట ఆగి, కార్తీక్ "ఇలా చాటుమాటు పంచాయతీలు మనకు బాగా ఎక్కువైపోతున్నట్లున్నాయి" అన్నాడు. జ్యోత్స్న "ఏం చేస్తాం బావా, నాకు నీకు ఇలా రాసిపెట్టి ఉంది" అంది. కార్తీక్ "రాత ఎలాగో మారదు మరదలా, మన చేతలే మార్చుకోవాలి" అన్నాడు. దానికి జ్యోత్స్న "ఏం సరి చేసుకోవాలి" అని అడిగింది. కార్తీక్ "మనం కాసేపు బావా మరదల్లా మాట్లాడుకుందాం" అన్నాడు.

కార్తీక్ అప్పుడు మా అత్త తప్పు చేసే మనిషి కాదు. తన వెనుక ఎవరో ఉన్నారని అర్థమైంది. తాళి తీయడంలో వెనుక నువ్వే ఉన్నావా?" అని అడుగుతాడు. జ్యోత్స్న "తాళి తెంచాను కాబట్టి తాళి తీసి ఉంటాను అనుకున్నావా? నాకేం లాభం దానివల్ల" అని జ్యోత్స్న ఎదురు ప్రశ్న వేసింది. కార్తీక్ నిన్ను ఇంకో ప్రశ్న అడుగుతాను" అని "నేనంటే నీకు ఇష్టం. నేను దీపను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు. దాని గురించి నువ్వు చాలా గొడవలు పడ్డావ్. అది నిజమా, అబద్ధమా?" అని సూటిగా అడిగాడు.

వారి మధ్య కొంచెం సంభాషణ జరిగిన తర్వాత.. ఛాలెంజ్ మొదలవుతుంది. "నేను ఉండగా నువ్వు ఏం చేయలేవు చిన్న మరదలా. మైండ్ గేమ్ ఆడటంలో గోల్డ్ మెడల్ తీసుకుని ఉంటావ్. కానీ నేను నువ్వు చదివిన కాలేజ్‌లో మాస్టర్‌ని. అత్తయ్యను ఎలా కలాపాలో నాకు తెలుసు" అని కార్తీక్ జ్యోత్స్నతో పొగరుగా అన్నాడు. "నీతో పెళ్లి విషయంలో చేసిన ఛాలెంజ్ ఓడిపోయాను. నా పగ దీప మీదే. అది నీ దాకా తెచ్చుకో" అంది జ్యోత్స్న. "నా భార్య, నేను వేరు కాదు. ఇద్దరం ఒకటే" అన్నాడు కార్తీక్. "అయితే నువ్వు ఇబ్బంది పడాలి సారీ బావా" అంది జ్యోత్స్న.

"నో ప్రాబ్లం మరదలా. దసరా చాలా దూరంలో ఉంది కానీ, ఈసారి నీకు నవరాత్రులు ముందే మొదలవుతాయి. ఒక్కో రాత్రి ఒక్కో అవతారం ఎత్తుతాను. నీకు నిద్ర కూడా పట్టదు. భయంతో పరుగు పెడతావో నా భార్య కాళ్ల మీదే పడతావో ఛాన్స్ నీకే వదిలేస్తాను. ముందు అత్త, మావయ్యను కలుపుతాను. ఆ తర్వాత నిన్ను దారిలోకి తీసుకొస్తాను. ఈ పగలు, ప్రతీకారాలు నాకు వద్దు బాబాయ్ అంటావ్. సెకండ్ షో ఇప్పుడే మొదలైంది. ఈసారి ఆట అదిరిపోద్ది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ పెద్ద మేడమ్ గారు" అనేసి కార్తీక్ వెళ్లిపోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+