470కి గాను 459 మార్కులు.. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వంటలక్క కూతురు !!
తెలుగులో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందుతున్న సీరియల్ కార్తీక దీపం. ఇప్పుడు ఈ సీరియల్ పార్ట్ 2 పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక దీపం 2 సీరియల్ కూడా ఆడియన్స్ ని అలరిస్తూ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీరియల్ ద్వారానే ప్రేక్షకులను తన అద్భుత నటనతో ఆకట్టుకుంది Baby Krithika. ఇందులో 'శౌర్య' పాత్రలో ఆమె చూపించిన సహజ నటన, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా కట్టిపడేశాయి. చిన్న వయసులోనే డైలాగ్ డెలివరీ, హావభావాలతో 'చిచ్చరపిడుగు'గా పేరు తెచ్చుకుంది.
ఈ సీరియల్‌లో Premi Viswanath పోషించిన 'వంటలక్క' పాత్రతో క్రితిక మధ్య ఉన్న బాండింగ్ ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయింది. వారి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సీరియల్‌కు ప్రధాన బలం అయ్యాయి. అందుకే ఈ జంటకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కాగా ఇప్పుడు ఈ చిన్నారి చదువులోనూ అసాధారణ ప్రతిభ చూపించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్ గానే విడుదలైన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఆమె అద్భుత మార్కులు సాధించి.. నటనతో పాటు అకడమిక్స్‌లోనూ తన సత్తా చాటింది.

చదువులోనూ టాప్ పర్ఫార్మెన్స్..
క్రితిక మొత్తం 470 మార్కులకు గాను 459 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లీష్‌లో 94, సంస్కృతంలో 99, ఫిజిక్స్‌లో పూర్తి 60/60, కెమిస్ట్రీలో 59, మ్యాథ్స్ Aలో 73, మ్యాథ్స్ Bలో 74 మార్కులు సాధించింది. తన మార్కుల మెమోను క్రితిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తనను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఫలితాలు చూసిన నెటిజన్లు, అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పలువురు టీవీ ప్రముఖులు కూడా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.
ప్రస్తుతం ప్రసారమవుతున్న 'కార్తీకదీపం-2'లో వంటలక్క పాత్రతో ప్రేమి విశ్వనాథ్ మళ్లీ అలరిస్తున్నప్పటికీ, శౌర్యగా మెప్పించిన క్రితిక మాత్రం ఇందులో కనిపించడం లేదు. అయినప్పటికీ, మొదటి భాగంలో ఆమె వేసిన ముద్ర ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోలేదు. ఇక టీవీతో పాటు క్రితిక సినిమాల్లోనూ తన ప్రతిభ చూపించింది. Mahesh Babu నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు ప్రాజెక్ట్‌ల్లో నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టిన ఆమె, సరైన సమయం వచ్చినప్పుడు సినిమాల్లో పెద్ద అవకాశాలు దక్కించుకుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications