నిజంగా ధైర్యం ఉంటేనే చూడండి.. ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్ ఇదే !
ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ వైపు చూడాల్సి వచ్చేది.. కానీ ఇప్పుడు 'ప్రపంచ సినిమా' మన అరచేతిలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన సినిమాలు కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యక్షమవుతుండటంతో, ఓటీటీ హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అంతే కాకుండా సినిమా రిలీజ్ అయిన రెండు మూడు వారాల్లోనే ఇంటికే వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే ప్రశాంతంగా సినిమా చూడటానికి మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలోనే ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే ఆదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర భాషల్లోని సినిమాలు, సిరీస్ లను కూడా సబ్ టైటిల్స్ తో చూసి మరీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు గానే సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎక్కువగా హరర్ కామెడీ చిత్రాలు సైతం వస్తున్నాయి. ప్రస్తుతం ఓ హారర్ వెబ్ సిరీస్ ఓటీటీని వణికించేస్తోంది. ఇన్ని రోజులు ఓటీటీకే పరిమితమైన ఆ సిరీస్.. ఇప్పుడు ఏకంగా యూట్యూబ్ లోకి ఫ్రీగా వచ్చేసింది.

బెస్ట్ థ్రిల్లర్..
తమిళంలో రూపొందించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ "కరువనమ్". రీసెంట్ గానే యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. మొత్తం మూడు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ అందుబాటులోకి తీసుకువచ్చారు మేకర్స్. కుమరన్ సుందరన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో.. ఉదయ సుందరి, జయ శ్రీ విజయన్, విఘ్నేష్ వరదరాజన్, వీరరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆద్యతం ఊహించని ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్లతో ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇస్తుంది.
కథ ఏంటంటే..
మీరా, షాలిని అనే ఇద్దరు అనాథలు ఓ ఆశ్రమంలో పెరుగుతుంటారు. వారిద్దరిని ఓ గొప్పింటి మహిళ దత్తత తీసుకుంటుంది. తల్లి మరణించడంతో ఆమె ఇంట్లో కొన్నాళ్లపాటు గడపాల్సి వస్తుంది. ఆ ఇంట్లో వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి.? వారి తల్లి ఎలా చనిపోయింది ? అన్నది కథ. ప్రతి సీన్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుందని చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.
-
తమిళ సాంగ్‌లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రోజా! వీడియో -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications