బిగ్ బాస్ వల్ల నా జీవితం సర్వ నాశనం అయింది..!
సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోంది బిగ్‌బాస్ షో . కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది. షో మొదట్లో సెలబ్రిటీలను మాత్రమే తీసుకురాగా తర్వాత సామాన్యులను, పెళ్లైన జంటలను కూడా షోకు తీసుకురావడం మొదలుపెట్టారు. తెలుగులో ద్విగజయంగా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్, మరో సీజన్‌కు రెడీ అవుతోంది.
జన్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్న భారీ సెట్ కూడా పూర్తి కావొచ్చింది. ఈ సీజన్‌లో హోస్ట్‌ను మారుస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ , 9వ సీజన్‌లో కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పెద్ద అగ్నీ పరీక్ష పేరిట పెద్ద ఎత్తును షోకు పబ్లిసిటీ తీసుకువచ్చారు. సెప్టెంబర్ 7 నుంచి షో మొదలు కానుంది. ఇదిలా ఉంటే గతంలో షోకు వెళ్లిన ఓ కంటెస్టెంట్ బిగ్‌బ బాస్‌పై సంచలన కామెంట్స్ చేసింది.

బుల్లితెర నటి కీర్తి భట్, బిగ్ బాస్ తర్వాత తన కెరీర్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 'కార్తీక దీపం' సీరియల్‌లోని హిమ పాత్రతో ఆమె బాగా ప్రాచుర్యం పొందారు. కానీ, బిగ్ బాస్ సీజన్ 6 తర్వాత పరిస్థితి మారిపోయిందని ఆమె వెల్లడించారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక తన కెరీర్‌కు పెద్దగా లాభం చేకూరలేదని తెలిపింది. బిగ్ బాస్‌కు వెళ్లిన చాలా మందికి సీరియల్స్, షోలలో అవకాశాలు వస్తున్నాయి. కానీ నాకు మాత్రం ఏ ప్రాజెక్ట్‌లు రాలేదని ఆమె చెప్పారు. దీనికి కారణం గ్లామర్ పాత్రలు, పొట్టి దుస్తులు ధరించమని కొందరు చెప్పగా, ఆమె వాటికి అంగీకరించకపోవడమేనని వెల్లడించారు.
కెరీర్ పరంగానే కాకుండా, కీర్తి భట్ వ్యక్తిగత జీవితంలోనూ అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె తన తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. అంతేకాకుండా, ఆ ప్రమాదం కారణంగా పిల్లలు పుట్టే అవకాశం కోల్పోయారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఆమె తన జీవిత భాగస్వామి విజయ్ కార్తీక్‌ను నిశ్చితార్థం చేసుకుంది.
తన పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రేమతో అంగీకరించినందుకు ఆమె అతనిపై కృతజ్ఞత వ్యక్తం చేసింది. కీర్తి భట్, విజయ్ కార్తీక్‌కు మధ్య జరిగిన నిశ్చితార్థం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.












Click it and Unblock the Notifications