హానీమూన్ ఫొటోలు బయటపెట్టిన కీర్తి సురేష్
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగింది. డిసెంబర్ 12న అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది.తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి సర్ ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్. కొద్ది రోజుల క్రితమే తన ప్రేమికుడు ఆంటోనితో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది.
డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్, తర్వాత తన భర్త ఆంటోని సంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. ఈ సందర్భంగా భర్తకు లిప్‌లాక్ ఇచ్చింది. కీర్తి సురేష్. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక పెళ్లి తతంగం ముగియగానే కీర్తి సురేష్ తిరిగి తన సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంది.

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి బేబీ జాన్ అనే సినిమాలో నటించింది. పెళ్లికి ముందే షూటింగ్ పూర్తి చేసిన కీర్తి , పెళ్లి తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది.'బేబి జాన్' ప్రమోషన్స్ కోసం కీర్తి ముంబైలో అడుగుపెట్టింది. సాధారణంగా పెళ్లైన నూతన జంట ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. సెలబ్రిటీలు అయితే హానీమూన్ పేరిట విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. కానీ కీర్తి సురేష్ పెళ్లై 10 రోజుల కాకుండానే ముంబైలో ప్రమోషన్స్‌కు అటెండ్ అయింది. బేబీ జాన్ విడుదల అయిన వెంటనే కీర్తి తన భర్తతో కలిసి హానీమూన్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలను కీర్తి సురేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.












Click it and Unblock the Notifications